బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి? కోమటిరెడ్డికి ఏ పదవి ఇచ్చారంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి? కోమటిరెడ్డికి ఏ పదవి ఇచ్చారంటే?

 Authored By jagadesh | The Telugu News | Updated on :23 December 2020,10:13 pm

ప్రస్తుతం తెలంగాణలో ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఒకటే. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరు అవుతారు? ఎవరు అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది? అసలు.. వచ్చే ఎన్నికల వరకైనా తెలంగాణలో మనుగడ సాగిస్తుందా? అనే మీమాంశ ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకే.. తదుపరి టీపీసీసీ చీఫ్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆచితూచి అడుగేస్తోంది.

ఇప్పటికే.. ఏఐసీసీ తెలంగాణ ఇన్ చార్జ్ మాణికం ఠాగూర్.. తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. అయితే మెయిన్ గా టీపీసీసీ అధ్యక్షుడిగా ఇద్దరి పేర్లు మాత్రం బాగా వినిపించాయి. అందులో ఒకటి రేవంత్ రెడ్డి పేరు కాగా.. మరోటి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు. వీళ్లిద్దరిలో ఒకరు మాత్రం టీపీసీసీ చీఫ్ అవుతారని అంతా భావిస్తూ వస్తున్నారు. అఫిషియల్ గా ఇప్పటి వరకు టీపీసీసీ చీఫ్ ఎవరు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బయటపెట్టలేదు. కానీ.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కాంగ్రెస్ హైకమాండ్.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నదట. ఆయన్నే టీపీసీసీ చీఫ్ గా నియమించేందుకు అధిష్ఠానం మొగ్గు చూపింది.. అని తెలుస్తోంది.

సీడబ్ల్యూసీ మెంబర్ గా కోమటిరెడ్డి

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని, సీడబ్ల్యూసీ మెంబర్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం నియమించినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీనియర్ నేత. కానీ.. రేవంత్ రెడ్డి దూకుడు మనస్తత్వం కలవాడు. ఎదుటివాడు ఎంతటి వ్యక్తి అయినా తన దూకుడుతనంతో అడ్డుకట్ట వేయగల వ్యక్తి. అలాగే ఎదుటివారికి సరైన సమాధానం చెప్పగల వ్యక్తి. అటువంటి నాయకుడే పీసీసీ చీఫ్ గా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని హైకమాండ్ భావించి రేవంత్ రెడ్డికే పీసీసీ పగ్గాలను ఇవ్వాలని అనుకుంటోందని తెలుస్తోంది. అయితే.. అఫిషియల్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటన వస్తే గానీ ఏమీ తెలియని పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నది.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది