Sagar Bypoll : సాగర్ ఎన్నికల ప్రచారం కోసం రేవంత్ రెడ్డి వైపు కాంగ్రెస్ చూపు? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sagar Bypoll : సాగర్ ఎన్నికల ప్రచారం కోసం రేవంత్ రెడ్డి వైపు కాంగ్రెస్ చూపు?

Sagar Bypoll : నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారానికి ఇంకా వారం రోజుల సమయమే ఉండటంతో… ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. అన్ని పార్టీలు… ముఖ్య నేతలను, కాస్తో కూస్తో పేరు ఉన్న నేతలను సాగర్ లో దించుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో అధికార టీఆర్ఎస్ పార్టీ ఉంది. సాగర్ ఉపఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :9 April 2021,12:06 pm

Sagar Bypoll : నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారానికి ఇంకా వారం రోజుల సమయమే ఉండటంతో… ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. అన్ని పార్టీలు… ముఖ్య నేతలను, కాస్తో కూస్తో పేరు ఉన్న నేతలను సాగర్ లో దించుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో అధికార టీఆర్ఎస్ పార్టీ ఉంది. సాగర్ ఉపఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఏకంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగారు. ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య అయినప్పటికీ.. బీజేపీ కూడా సాగర్ లో దూకుడు పెంచింది. అందుకే… ఆయా పార్టీల ముఖ్య నేతలే డైరెక్ట్ గా రంగంలోకి దిగి వ్యూహాలు రచిస్తున్నారు.

revanth reddy to participate in nagarjuna sagar election campaign

revanth reddy to participate in nagarjuna sagar election campaign

టీఆర్ఎస్ పార్టీ కోసం సీఎం కేసీఆర్ సాగర్ లో ప్రచారం చేయనున్నారు. ఈనెల 14న సీఎం కేసీఆర్ సభ జరగనుంది. హాలియాలో ఈసభను నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఝలక్ ఇవ్వాలంటే కాంగ్రెస్ లో ఉన్న సరైన నాయకుడు అంటే కేవలం రేవంత్ రెడ్డి మాత్రమేనని… అందుకే సాగర్ లో ఆయన ప్రచారం కోసం కాంగ్రెస్ నేతలంతా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడొస్తారా? సాగర్ లో ఎప్పుడు ప్రచారం చేస్తారా? అని అంతా అనుకుంటుండగా…. రేవంత్ రెడ్డి సాగర్ లో ఇవాళ్టి నుంచి అంటే శుక్రవారం నుంచి ప్రచారం చేయనున్నారు. సాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి మీదనే ఆశలు పెట్టుకోవడంతో పాటు హైకమాండ్ కూడా జానారెడ్డి గెలుపు బాధ్యతను రేవంత్ రెడ్డికి అప్పగించింది. దీంతో శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు.

Revanth Reddy : రేవంత్ రెడ్డి రోడ్ షో

రేవంత్ రెడ్డి సాగర్ లో తన ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొననున్నారు. రేవంత్ రెడ్డి… నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా… ఆయన ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ను తయారు చేశారు. దీంతో… ఆయన ఎన్నికల ప్రచారం ముగిసేవరకు సాగర్ లోనే ఉండి.. జానారెడ్డి గెలుపు కోసం వ్యూహాలు రచించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా… రేవంత్ రెడ్డి వస్తున్నారంటేనే… కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగింది. రేవంత్ రెడ్డి వస్తే చాలు… కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే… అని నేతలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది