Revanth Reddy : ప్రజల కోసం పోరాడిన కేసీఆర్ ని అలా చూసి బాధేసింది ఎమోషనల్ అయిన రేవంత్ రెడ్డి
ప్రధానాంశాలు:
Revanth Reddy : ప్రజల కోసం పోరాడిన కేసీఆర్ ని అలా చూసి బాధేసింది ఎమోషనల్ అయిన రేవంత్ రెడ్డి
Revanth Reddy : నాలుగు రోజుల క్రితం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కాలు జారీ పడిన సంగతి తెలిసిందే. తుంటి ఎముక విరగడంతో యశోద ఆసుపత్రిలో చికిత్స కూడా చేయించుకున్నారు. అయితే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చూడడానికి సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఆయనను కలిసిన వెంటనే నమస్కారం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. 15 నిమిషాల పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కేటీఆర్ తో కూడా రేవంత్ రెడ్డి కాసేపు మాట్లాడారు. కేటీఆర్ తో కలిసి రేవంత్ రెడ్డి లోపలికి వెళుతున్నప్పుడు కేటీఆర్ పై సీఎం రేవంత్ భుజంపై చేయి వేసి మాట్లాడారు. కేటీఆర్ కు ధైర్యం చెప్పారు.
కేసీఆర్ పరామర్శించిన తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు ప్రమాదవశాత్తు కింద పడ్డారు. అందుకు సంబంధించి వారు యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వారిని కలిసి పరామర్శించిన, వారికి సర్జరీ జరిగింది. ఆరోగ్యం కుదుటపడింది. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. వారి వైద్య సహాయ సహకారాలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోమని వైద్యులకు ఆదేశించామని, కెసిఆర్ త్వరగా కోలుకొని ప్రజల తరపున శాసనసభలో సమస్యల మీద వారు మాట్లాడాలని, వారి సూచనలు, సలహాలు కూడా మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందించడానికి ఆయన అవసరం ఉన్నదని, వారు త్వరగా కోలుకొని శాసనసభ సమావేశాల్లో పాల్గొనాలని వారిని కోరడం జరిగింది. డాక్టర్ కూడా వారి ఆరోగ్యం కుదుట పడిందని తెలిపారు.
వైద్య సహాయ సహకారాల అందుతున్నాయి. వారు కూడా కోల్కున్నట్లుగానే ఉన్నారు. కచ్చితంగా కోలుకుంటారు అని రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక ఇప్పుడు ఇప్పుడే కేసీఆర్ నెమ్మది గా నడవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఆసుపత్రి సిబ్బంది కూడా ఆయన ఆరోగ్యం గురించి బులెటిన్ ను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య నిలకడగానే ఉంది అని వైద్యులు తెలిపారు. ఇక శుక్రవారం రోజున కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కారు గారి కింద పడ్డారు దీంతో ఆయన నుండి ఎముక విరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత గాయానికి శస్త్ర చికిత్స చేయించారు. ఈ క్రమంలో ని ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి పరామర్శించడానికి ఈరోజు ఆసుపత్రికి వెళ్లారు అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.