ATM Transaction Charges : మినిమమ్ బ్యాలెన్స్, మెయింటెనెన్స్ ఛార్జీల‌తో ఆ బ్యాంక్ కు కోట్ల‌ల్లో ఆదాయం..? ఎందుకో తెలిస్తే షాకే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ATM Transaction Charges : మినిమమ్ బ్యాలెన్స్, మెయింటెనెన్స్ ఛార్జీల‌తో ఆ బ్యాంక్ కు కోట్ల‌ల్లో ఆదాయం..? ఎందుకో తెలిస్తే షాకే..

 Authored By mallesh | The Telugu News | Updated on :23 May 2022,8:20 am

ATM Transaction Charges : కేవ‌లం ఏటీఎమ్ స‌ర్వీస్ చార్జీలు, మినిమ‌మ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయ‌ని ఖాతాదారుల‌నుంచి ఓ బ్యాంక్ కు ఏకంగా వంద‌ల కోట్ల రూపాయ‌లు వ‌చ్చిప‌డ్డాయి. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్ర‌కారం దేశంలోని అన్ని బ్యాంకులు మినిమ‌మ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయ‌క‌పోతే ఫెనాల్టీ చార్జీల‌ను వ‌సూలు చేస్తున్నాయి. అలాగే ఏటిఎమ్ ద్వారా ట్రాన్సాక్ష‌న్స్ ప‌రిమితికి మించి చేస్తే అద‌న‌పు చార్జీల‌ను వ‌సూలు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ అద‌న‌పు చార్జీలు మొత్తంగా క‌లుపుకొని బ్యాంకుల‌కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడ‌తున్నాయి. ఇందులో భాగంగా పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ ఎంత ఆర్జిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం…పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు దేశంలోనే రెండో అతిపెద్ద ప్ర‌భుత్వ‌రంగ వాణిజ్య బ్యాంక్ గా కొన‌సాగుతోంది.

దేశ‌వ్యాప్తంగా 4500 కు పైగా బ్రాంచ్ లు ఉన్నాయి. మొద‌ట‌గా పంజాబ్ నేషనల్ బ్యాంకును 1895లో లాహోర్ లో లాలా లజపతి రాయ్ స్థాపించారు. కాగా ఇండియాలో ఇండియ‌న్స్ ఎస్టాబ్లిష్ చేసిన మొద‌టి బ్యాంక్ ఇదే. అయితే ఇటీవ‌ల ఈ బ్యాంక్ కొత్త నిబంధ‌న‌ల‌తో మినిమమ్ బ్యాలెన్స్, మెయింటెనెన్స్ ఛార్జీలు విపరీతంగా పెంచేసింది. దీంతో క‌స్ట‌మ‌ర్లు భారీగానే చెల్లించుకుంటున్నారు.పట్టణ ప్రాంతాల్లోని ఖతాదారులు తమ అకౌంట్‌లో కనీసం రూ.10 వేలు మెయింటైన్ చేయాలి. కాగా సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు మినిమమ్ బ్యాలెన్స్ పరిమితిని రూ.1000 గా నిర్ణయించింది.మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే గతంలో ఉన్న 300 రూపాయల ఫెనాల్టీని రూ. 600 కు పెంచేసింది. అలాగే సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల ఖాతాదారుల‌కు రూ. 400 గా నిర్ణ‌యించింది.

ATM Transaction Charges In Fy22 Minimum Balance Charge Collections

ATM Transaction Charges In Fy22 Minimum Balance Charge Collections

ATM Transaction Charges : ప‌రిమితికి మించితే…

మినిమ‌మ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయ‌నందుకు 85,18,953 మంది ఖాతాదారుల నుంచి రూ.239 కోట్లు వ‌సూలు చేసింది. అలాగే ఏటీఎం అద‌నపు చార్జీల పేరుతో రూ. 645 కోట్లు క‌లెక్ట్ చేసింది. కాగా పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ ఏటీఎంలో నెల‌లో 5 సార్లు లావాదేవీలు ఉచితంగా జ‌ర‌ప‌వ‌చ్చు. అంత‌కుమించి జ‌రిపితే ప్ర‌తి ట్రాన్సాక్ష‌న్ కు రూ.10 వ‌సూలు చుస్తుంది. అలాగే ఇత‌ర బ్యాంకుల ఏటీఎంలు ఉప‌యోగిస్తే మెట్రోయేత‌ర సిటీల్లో 5 ట్రాన్సాక్ష‌న్స్ ఉచితం. కాగా ప‌రిమితికి మించి చేస్తే ప్ర‌తి లావాదేవికి రూ.20 వ‌డ్డిస్తోంది.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది