Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై బహిరంగంగా స్పందించారు. ఒక వ్యక్తి తన పేరుతో, నకిలీ స్వరంతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆమె తెలిపారు. ఆ వ్యక్తి 9445893273 నంబర్ ద్వారా సంప్రదిస్తున్నాడని, ఆ నంబర్ తనది కాదని రుక్మిణి స్పష్టం చేశారు.
#image_title
అదంతా మోసం..
ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. “ఈ నంబర్ నాది కాదు. ఈ నంబర్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దు. నా పేరును ఉపయోగించి, నకిలీ స్వరంతో ఇతరులను మోసం చేయడం సీరియస్ సైబర్ నేరం. ఇందులో ఎవరి ప్రమేయమున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాను. అవసరమైతే పోలీసు కేసులు కూడా వేస్తాను” అని హెచ్చరించారు.
అలాగే అభిమానులు, ఫాలోవర్స్‌కి “ఏదైనా అనుమానం ఉంటే నన్నే లేదా నా టీమ్‌ను నేరుగా సంప్రదించండి. మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండండి” అని సూచించారు. ఆమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సప్తసాగరాలు దాటి ’ సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన రుక్మిణి వసంత్, ప్రస్తుతం యశ్ సరసన నటిస్తున్న ‘ టాక్సిక్ ’ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాణం జరుగుతోంది. ట్లు పెడుతున్నారు.