Roja : నేను అలాంటి సినిమాలు తీశాన‌ని న‌న్ను ఏడిపించావు.. చంద్రబాబుపై రోజా సంచలన కామెంట్స్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja : నేను అలాంటి సినిమాలు తీశాన‌ని న‌న్ను ఏడిపించావు.. చంద్రబాబుపై రోజా సంచలన కామెంట్స్..

 Authored By mallesh | The Telugu News | Updated on :19 November 2021,8:21 pm

Roja : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మీడియా సాక్షిగా కన్నీటి పర్యంతమయ్యారు. తన భార్యను ఉద్దేశించి తప్పుడు వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీలో తనకు జరిగిన అవమానం తట్టుకోలేక, ముఖ్యమంత్రి అయ్యాకే సభకు వస్తానని చంద్రబాబు శపథం చేశారు. కాగా, చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తాజాగా స్పందించారు. ఆమె ఏమందంటే.. గతంలో ఎన్టీఆర్‌ను ఎలా ఏడిపించావో..అదే పరిస్థితి చంద్రబాబుకు వచ్చిందని రోజా ఆనందం వ్యక్తం చేసింది. విధి ఎవరినీ విడిచిపెట్టదని ఘాటు కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే గతంలో హైదరాబాద్ సాక్షిగా తనపై పలు ఆరోపణలను చంద్రబాబు చేయించారని గుర్తు చేసింది రోజా.

Roja : బాబుకు తగిన శాస్తి జరిగిందన్న రోజా..

roja sensational comments on chandrababu

roja sensational comments on chandrababu

‘రోజా బ్లూ ఫిల్మ్‌లో నటించింది’ అంటూ పీతల సుజాతతో సీడీలు చూపించిన విషయం మరిచిపోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పుడు తన ఫ్యామిలీ, విలువలు గుర్తుకురాలేదా అని ప్రశ్నించింది. అధికారంలో ఉంటే ఏది చేసినా నడుస్తుందని అహంకారంతో చంద్రబాబు అప్పట్లో విర్రవీగారని ఆరోపించింది. భారతమ్మ, షర్మిల, విజయమ్మపై టీడీపీ అధినేత చంద్రబాబు అసత్య ప్రచారం చేయించారని విమర్శించింది రోజా. ప్రధాని మోడీని సైతం చంద్రబాబు వదలలలేదని, సోషల్ మీడియాలో ఎన్నో విధాలుగా అసత్య ప్రచారాలు చేశారని అంది రోజా. వారందరి ఉసురు తగలడం వల్లే చంద్రబాబుకు ఈ పరిస్థితి ఏర్పడిందని అంటూ..చంద్రబాబును ఉద్దేశించి..బై బై బాబు. బైబై అంటూ చంద్రబాబుకు వెటకారంగా వీడ్కోలు పలికింది.

మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మూడేళ్ల ముందరే బాగా హీటెక్కాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అసెంబ్లీకి రానని శపథం చేయడం ద్వారా.. ఇకపై రాజకీయ క్షేత్రంలో ఇంకా యాక్టివ్‌గా పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అధికార వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు యుద్ధమే ప్రకటించారు. మొత్తంగా ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. ఇప్పటి వరకు అయితే అధికార వైసీపీపై పోరుకు ఒక వైపున చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ, మరో వైపున బీజేపీ-జనసేన సిద్ధంగా ఉన్నాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది