Roja : సీఎం జగన్ నిర్ణయంతో తీవ్ర మనస్తాపం.. రాజీనామాకు రెడీ అయిన రోజా..!?
Roja : ఏపీలోని అధికార వైసీపీలోని నేతల్లో నగరి ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకుంది. విషయం ఏదైనా అధికార వైసీపీ వాదనను బలపరుస్తూ విపక్షాలపైన తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటుంది రోజా. నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజా.. త్వరలో ఏపీ కేబినెట్ లోకి వెళ్తుందని గత కొద్ది రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. కానీ, అలా జరగకపోగా, తాజాగా రోజాకు సీఎం జగన్ షాక్ ఇచ్చినంత పని చేశారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ చర్చ ఎందుకు జరుగుతున్నదంటే..తాజాగా ఏపీ ప్రభుత్వం శ్రీశైలం దేవస్థానం పాలకమండలిని నియమించింది. ఆ మండలిలో నగరికి చెందిన రెడ్డివారి చక్రపాణి రెడ్డికి స్థానం దక్కింది.
దాంతో ఈ విషయం తెలుసుకున్న రోజా పార్టీ నిర్ణయంపైన మండిపడుతున్నట్లు సమాచారం. అవసరమైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రోజా పేర్కొన్నట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.నగరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు అయిన ఎమ్మెల్యే రోజా, చక్రపాణి రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి.స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగానూ వీరిరువురి మధ్య మాటల తూటాలు పేలాయి. అయితే, ఆ తర్వాత కాలంలో ఈ అంశాన్ని రోజా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. నగరిలో పార్టీకి వ్యతిరేకంగా చక్రపాణిరెడ్డి పనిచేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కంప్లయింట్ చేసింది. అయితే, అధిష్టానం ఈ విషయం పక్కనబెట్టి చక్రపాణి రెడ్డికే పదవి ఇవ్వడాన్ని రోజా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Roja : సింగిల్ గానే పోరాడుతున్న ఫైర్ బ్రాండ్ లీడర్…
ఈ నిర్ణయంతో తాను తీవ్రంగా మనస్తాపం చెందానని రోజా తన అనుయూయుల వద్ద పేర్కొనట్లు టాక్. ఈ విషయాన్ని తాను త్వరలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకెళ్తానని రోజా అంటోందని సమాచారం.నిజానికి రోజా నగరి నియోజకవర్గంలో గత కొంత కాలంగా సింగిల్ గానే పోరాటం చేస్తున్నారని ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. రోజాకు ప్రత్యర్థుల కంటే కూడా సొంత పార్టీలోని నేతల వలనే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా చర్చించుకుంటున్నారు. చూడాలి మరి.. రోజాకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎలా సముదాయిస్తారో.. కేబినెట్ లోకి మంత్రిగా తీసుకుంటారా.. అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.