RRB Jobs : గుడ్‌న్యూస్‌.. RRB టెక్నీషియన్ రిక్రూట్మెంట్… 9వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RRB Jobs : గుడ్‌న్యూస్‌.. RRB టెక్నీషియన్ రిక్రూట్మెంట్… 9వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…!

 Authored By aruna | The Telugu News | Updated on :15 February 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  RRB Jobs : గుడ్‌న్యూస్‌.. RRB టెక్నీషియన్ రిక్రూట్మెంట్... 9వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...!

RRB Jobs తాజాగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిరుద్యోగులకు శుభవార్త తీసుకొచ్చింది..అయితే ప్రస్తుతం ఈ మధ్యకాలంలో చూసినట్లయితే రైల్వే ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల కావడం జరుగుతుంది. ఇలాంటి తరుణం లో మరో గుడ్ న్యూస్ ను RRB తీసుకొచ్చింది. 9వేల టెక్నీషియన్ పోస్టులకు పాట్నా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ , టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ భర్తీ చేయనున్నట్లు సమాచారం. అయితే టెక్నీషియన్ పోస్టుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను వచ్చే నెల తొమ్మిది నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునేవారు ఏప్రిల్ 8వ తేదీ లోపు చేసుకోవాల్సిందిగా నిర్ణయించడమైనది. ఇక ఈ రిక్రూట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ఈ కథనాన్ని పూర్తిగా చదవండి..

RRB Jobs : విద్యార్హత…

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ఆయా పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్ , ఐటిఐ , డిప్లమా , డిగ్రీ , ఇంజనీరింగ్ వంటి విద్యార్హతను కలిగి ఉండాలి.

RRB Jobs : వయస్సు… ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

RRB Jobs : రుసుము… ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారికి జనరల్ మరియు OBC EWS అభ్యర్థులకు 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మహిళలు SC ,ST ఇతర రిజర్వేషన్ కలిగి ఉన్నవారు 250 రూపాయలను ఫీజుగా చెల్లించాలి.

RRB Jobs : పరీక్ష విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత CBT – 2 నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తారు

RRB Jobs : ఎలా అప్లై చేసుకోవాలి… : ఈ పోస్టులకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు. కాబట్టి సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి సమాచారాన్ని నమోదు చేసుకుని సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

RRB Jobs : జీతం : ఇక ఈ ఉద్యోగంలో ఎంపికైన వారికి టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో ఎంపిక అయిన వారికి నెలకు రూ.29,200 జీతం ఇవ్వబడుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ – 3 కి మాత్రం నెలకు రూ.19,900 జీతం ఇవ్వబడుతుంది.

RRB Jobs : పరీక్ష తేదీలు : ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షలను అక్టోబర్ లేదా డిసెంబర్ లో నిర్వహించడం జరుగుతుంది. ఇక ఈ CBT పరీక్షలో ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేయనున్నట్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించడం జరిగింది.

RRB Jobs : అఫీషియల్ వెబ్ సైట్స్

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం కింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ఉపయోగించుకోగలరు.

https://indianrailways.gov.in/

https://www.rrbpatna.gov.in/

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది