RS Praveen Kumar : కేసీఆర్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్? ఆయన రాజీనామా చేసింది అందుకేనా?
RS Praveen Kumar ఐపీఎస్ కు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ RS Praveen Kumar తన భవిష్యత్ కార్యాచరణపై ఒక్కొక్కటిగా క్లారిటీ ఇస్తున్నారు. రాజకీయ ప్రవేశం ఖాయమన్నట్లుగా సంకేతాలు ఇస్తున్న సీనియర్ ఐపీఎస్.. సంచలన వ్యాఖ్యలతో కాక రేపుతున్నారు. తాజాగా తెలంగాణ Telangana సిఎం కేసిఆర్ CM KCR పై సంచలన కామెంట్స్ చేశారు. సంగారెడ్డిలో స్వేరోస్ సంస్థ సభ్యులతో సమావేశం నిర్వహించిన ప్రవీణ్ కుమార్.. కేసిఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. తన పైన నమోదైన కేసులపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ RS Praveen Kumar తీవ్రంగా స్పందించారు. తాను ఉద్యోగానికి వీఆర్ఎస్ చేసిన మరుసటి రోజునే కరీంనగర్ Karim Nagar లో తనపై పోలీస్ కేస్ పెట్టారని, తాను వాటికి భయపడనని ప్రవీణ్ కుమార్ RS Praveen Kumar అన్నారు.
బహుజనులే కేంద్రంగా తన పార్టీ ఉండనుందన్న విషయాన్ని ప్రవీణ్ కుమార్ RS Praveen Kumar స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీఎం హుజరాబాద్‌లో ఖర్చు పెట్టే వెయ్యి కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల కోసం ఖర్చు పెట్టాలని ప్రవీణ్ కుమార్ RS Praveen Kumar డిమాండ్ చేశారు.
హుజూరాబాద్ లో .. RS Praveen Kumar
ప్రవీణ్ కుమార్ RS Praveen Kumar భవిష్యత్ అడుగులు త్వరలో జరగనున్న హుజురాబాద్ నియోజకవర్గంలోనూ ప్రభావితం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. హుజురాబాద్ లో దాదాపు 45 వేల దళిత ఓటర్లున్నారు. ప్రవీణ్ కుమార్ ప్రభావం వాళ్లపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసీఆర్ KCR సర్కార్ తలపెట్టిన దళిత బంధు స్కీమ్ పైనా ప్రవీణ్ కుమార్ RS Praveen Kumar అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. దళిత ముఖ్యమంత్రి అని ఓట్ల కోసం మోసం చేస్తారు, అలాంటివి మళ్ళీ రానీయకండని ప్రవీణ్ కుమార్ RS Praveen Kumar పిలుపునిచ్చారు. ఇటువంటి అవకాశము వెయ్యి ఏళ్ళు వరకు రాదన్నారు. ప్రవీణ్ కుమార్ RS Praveen Kumar తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
కేసీఆర్ పైనే.. RS Praveen Kumar
కేసీఆర్ డైరెక్షన్ లోనే ప్రవీణ్ కుమార్ RS Praveen Kumar నడుస్తున్నారన్న వాదనకు చెక్ పడినట్లైంది. అంతేకాదు కేసీఆర్ టార్గెట్ గానే ప్రవీణ్ కుమార్ రాజకీయ అడుగులు ఉండబోతున్నాయన్నది స్పష్టమవుతోంది. ప్రవీణ్ కుమార్ తాజా కామెంట్లతో టీఆర్ఎస్ పార్టీలో కలవరం కనిపిస్తోందని అంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో దళిత ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు కేసీఆర్. అందుకోసమే దళిత బంధు స్కీం తీసుకువస్తున్నారు. అయితే ప్రవీణ్ కుమార్ RS Praveen Kumar తమకు వ్యతిరేకంగా మాట్లాడితే.. దళిత వర్గాలపై ఆ ప్రభావం ఉంటుందనే ఆందోళన గులాబీ లీడర్ల నుంచి వస్తోంది. మొత్తంగా ప్రవీణ్ కుమార్ RS Praveen Kumar రాజకీయ అడుగులు ఏ పార్టీకి నష్టం కలిగించబోతుందన్నది ఆసక్తిగా మారింది.