RTO New Rules : డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఇకనుంచి ఆర్డీఓ ఆఫీస్ ఎళ్లాల్సిన అవసరం లేదు..ఆర్టీఓ కొత్త రూల్ ఇదే..!
ప్రధానాంశాలు:
RTO New Rules : డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఇకనుంచి ఆర్డీఓ ఆఫీస్ ఎళ్లాల్సిన అవసరం లేదు..ఆర్టీఓ కొత్త రూల్ ఇదే..!
RTO New Rules : మన దగ్గర ఏదైనా ప్రభుత్వానికి సంబందించిన డాక్యుమెంట్ పొందాలంటే ఆఫీస్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఐతే కొన్ని సేవలు ఆన్ లైన్ లోకి వచ్చినా సరే కొన్ని మాత్రం ఇంకా ఆఫీస్ కి వెళ్లే పనులు చేయించాల్సిన పని ఉంది. అందుకే ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఐతే డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి పొందాలంటే మాత్రం కచ్చితంగా ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్లాలి. అలా వెళ్లకుండా పని జరగదు. కానీ ఈ ప్రక్రియను కూడా మార్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఆర్టీఓ భౌతిక సందర్శనం లేకుండానే డ్రవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఏర్పాటు చేస్తున్నారు. ఇదివరకు డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లి స్లాట్ బుక్ చేసుకుని అక్కడ వారు అడిగిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఐతే ఇక మీదట ఆ అవసరం లేకుండానే ఆన్ లైన్ ఇతర సేవల మాదిగానే ఇది కూడా అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆన్ లైన్ లో వారి దరఖాస్తు చేసుకుని దాన్ని పొందవచ్చు.
RTO New Rules కొత్త నిబంధల ప్రకారం..
ఈ కొత్త నిబంధల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మరింత సులభం అవుతుంది. నేషనల్ ఇంఫర్మేటిక్ సెంటర్ వెబ్ సైట్ లో నమోదు చేసుకుని తాత్కాలిక డ్రైవింగ్ లైసెన్స్ దరకాస్తు దారుల ధృవీకరణ ఆహార్ కార్డ్ చిరునామాని యూస్ చేయోచ్చు. ఆహార్ కార్డ్ లో అందించిన చిరునామా ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయబడతై.
ఐతే ప్రభుత్వం దీన్ని ఇంకా అధికారికంగా అమలు చేయలేదు. కొత్త ఆన్ లైన్ వ్యవస్థ వల్ల డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభతరం అవుతుంది. ఐతే ఆర్టీఓ ప్రక్రియ అమలులో ఉన్న కారణంగా డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియని మరింత సులభం చేయనున్నారు. దీని వల్ల ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లి గంటల పాటు సమయం వృధా చేసుకునే అవసరం ఉండదు.