Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి 8 మంది బలి… సజ్జల రామకృష్ణారెడ్డి
Sajjala Ramakrishna Reddy : ‘చంద్రబాబు తన పబ్లిసిటీ పిచ్చితో మరో సారి అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. గతంలో గోదావరి ఫుష్కారాల్లో ముహూర్తం పేరుతో పబ్లిసిటీ స్టంట్ చేసి అమాయకులను బలిగొన్నారు. ఇప్పడు మరోసారి ప్లాన్ ప్రకారం కందకూరులో ఇరుకు రోడ్డులో రోడ్‌షో నిర్వహించి తన సభకు వేల మంది వచ్చారని నిరూపించుకోవడానికి చేసిన పబ్లిసిటీ స్టంట్ లో 8 మంది అమాయకులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు’ అని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు రోడ్ షోలో భాగంగా కందుకూరు వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై గురువారం నాడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తన మీటింగ్ కు జనం ఎక్కువ వచ్చారని పబ్లిసిటీ చేసుకునేందుకు చేసుకునేందుకు
చంద్రబాబు ప్రయత్నం బెడిసి కొట్టింది.పబ్లిసిటీ కోసం అమాయక టీడీపీ కార్యకర్తల ప్రాణాలు బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కందకూరు ఘటన ప్రమాదం కాదని ఆరోపించారు. తన అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు ఎన్ని డ్రామాలు అయినా ఆడతారని, ప్రజలను పొట్టన బెట్టుకోవడం చంద్రబాబుకు ఎంత వరకు సబబని ప్రశ్నించారు. చంద్రబాబు పిచ్చితో ఎనిమిది మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పకుండా డ్రామాలా.. కందకూరులో జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూడటం సిగ్గచేటని విమర్శించారు. ఇరుకు రోడ్డులో మీటింగ్ ఏర్పాటు చేసి పోలీసుల సూచనలు ఏవైనా పాటించారా? అని అడగడం చంద్రబాబు డ్రామా రాజకీయాలకు నిదర్శనమన్నారు. కందకూరులో అనుమతి తీసుకున్న
ప్రాంతం కంటే ముందుకెళ్లి చంద్రాబు సభ నిర్వహించారని పేర్కొన్నారు. కానీ టీడీపీ పోలీసులపైనే విమర్శలు చేస్తోందన్నారు.కందుకూరు తొక్కిసలాట, 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఘటనపై తప్పు ఒప్పుకుని వెంటనే ప్రజలను, టీడీపీ కార్యకర్తలను క్షమాపణలు కోరాలన్నారు. 8 మంది అమాయకులు చనిపోయినా చంద్రబాబు ముఖంలో పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు. ఘటనను సమర్ధించుకోవడం చూస్తుంటే చంద్రబాబు లెక్కలేనితనం, అహంకారం కనిపిస్తోందన్నారు. తన చుట్టూ ఏది సెన్సేషన్ చేసుకోవాలని చంద్రబాబు నిత్యం ఆరాటపడుతుంటారని, ఆ ఆలోచన వల్లే కందకూరులో ఈ నరబలి జరిగిందని, దీనిపై క్షమాపణలు చెబితేనే చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆత్మ శాంతి లభిస్తుందన్నారు.