Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కెసిఆర్ వ్యాఖ్యలకి సజ్జల స్ట్రాంగ్ కౌంటర్ !
Vizag Steel Plant : ప్రస్తుతం ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడమే ఒప్పుకోం అంటూ ఏపీ ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అనే వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారం తాజాగా తెలంగాణ ప్రభుత్వ జోక్యంతో మళ్లీ తెరమీదికి వచ్చింది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్ వేయడం అంటే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం కాదు అని పరిమిత భాగస్వామ్యం కోసం బిడ్ల సేకరణ మాత్రం జరుగుతోందన్నారు. దాని కోసం వైజాగ్ స్టీల్ బిడ్స్ కోరుతుంటే.. విపక్షాలు, మీడియా మాత్రం బీఆర్ఎస్ పార్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కొంటోందంటూ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసలు బిడ్స్ కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏం ప్రకటన ఇచ్చిందో దాన్ని చదివి సజ్జల వినిపించారు. ఇదివరకు ప్లాంట్ కొనసాగింపు కోసం సాయం అందించాలని కేంద్రాన్ని సీఎం జగన్ కోరిన విషయాన్ని సజ్జల ఈసందర్భంగా గుర్తు చేశారు.
Vizag Steel Plant : ప్లాంట్ కొనసాగింపునకు సాయం కావాలని కేంద్రాన్ని కోరిన సీఎం జగన్
అదే విషయం తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడం కోసమే తాము ప్రయత్నిస్తున్నామని.. టేకోవర్ కోసం బిడ్లు వేయడం లేదన్నారు. అసలు తెలంగాణ ప్రభుత్వం బిడ్ లో పాల్గొంటుందా? అంటూ సజ్జల ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకొస్తుంటే.. ఏపీ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయని.. స్టీల్ ప్లాంట్ విషయంలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.