Samsung Galaxy S22 Plus : సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ మొబైళ్ల సేల్ స్టార్ట్… రూ.5,000 క్యాష్‌బ్యాక్
Samsung Galaxy S22 Plus : రోజుకో రకం కొత్త ఫోన్లు మార్కెట్ లోకి లాంచ్ అవుతూనే ఉన్నాయి. సరికొత్త ఫీచర్స్ తో మనసుని దోచేస్తునే ఉన్నాయి. అయితే ఇప్పుడు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న గెలాక్సీ ఎస్22 సిరీస్ మొబైళ్లను సామ్‌సంగ్ విడుదల చేసింది. భారత్‌లో శాంసంగ్ స్మార్ట్ మొబైల్స్ కు మంచి మార్కెట్ ఉంది. మార్కెట్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో నయా నయా మొబైల్స్ ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మరో కొత్త ఫోన్తో ముందుకొచ్చింది. సామ్ సంగ్ గెలాక్సి ఎస్ 22 సరీస్ లు ప్రస్తుతం ఇండియాలో ఈ ఫోన్స్ సేల్ మొదలైంది.సామ్‌సంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2022 ఈవెంట్‌లో గెలాక్సీ ఎస్22 సిరీస్‌లో మూడు ఫోన్లను దక్షిణకొరియా కంపెనీ సామ్‌సంగ్ లాంచ్ చేసింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22 అల్ట్రా మొబైళ్లను ప్రకటించింది.
ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లతో ఈ హైఎండ్ మోడల్స్ వచ్చాయి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 ప్లస్ మొబైళ్ల స్పెసిఫికేషన్లు, ధర, వేరియంట్ల వివరాలు ఇప్పడు చూద్దాం.Sam sung: సామ్ సంగ్ గెలాక్సి S22 మొబైల్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.72,999, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.76,999గా ఉంది. సామ్ సంగ్ Samsung Galaxy S22+ ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.84,999గా ఉండగా.. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ రేట్ రూ.88,999గా ఉంది. ఇక సామ్‌సంగ్ బెస్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.1,09,999, 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ ధర రూ.1,18,999గా ఉంది.
Samsung Galaxy S22 Plus : సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 ప్లస్ స్పెసిఫికేషన్లు..
డిస్‌ప్లే: 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండే ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేలతో ఈ మొబైళ్లు వస్తున్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22లో 6.1 ఇంచుల డిస్‌ప్లే ఉండగా.. ఎస్22 ప్లస్ 6.6ఇంచుల డిస్‌ప్లేతో వస్తోంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 ప్లస్ మొబైళ్ల వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ డ్యుయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ ప్రధాన కెమెరా, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉండే 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 3X ఆప్టికల్ జూమ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్న 10 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా ఉన్నాయి. అలాగే 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
గెలాక్సీ ఎస్22 మొబైల్‌లో 3700ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 25 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. అలాగే 15వాట్ల వైర్‌లెస్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. గెలాక్సీ ఎస్22 ప్లస్ ఫోన్ 4500ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుండగా.. 45 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ల వైర్‌లెస్ చార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. గెలాక్సీ ఎస్22 సిరీస్ ఫోన్లలో 4నానో మీటర్ల ఆధారిత పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఉంటుంది. దేశాలను బట్టి ఎగ్జినోస్ 2200 లేదా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్లతో ఈ ఫోన్లు లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయి.
సామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్‍తో పాటు దేశంలోని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ మొబైళ్లను కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ( HDFC Bank ) క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి సామ్‌సంగ్ ఎస్22 సిరీస్ మొబైళ్లను కొంటే రూ.5,000 తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మార్చి 31 వరకు ఈ ఆఫర్ ఉంటుందని సామ్ సంగ్ పేర్కొంది.