Samsung : ముందు వెనక స్క్రీన్ లతో రానున్న సామ్ సంగ్ సరికొత్త ఫోన్… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samsung : ముందు వెనక స్క్రీన్ లతో రానున్న సామ్ సంగ్ సరికొత్త ఫోన్…

 Authored By aruna | The Telugu News | Updated on :31 August 2022,7:00 am

Samsung : దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెలికాం కంపెనీ సాంసంగ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ మొబైల్స్ తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. అయితే త్వరలో ఈ కంపెనీ మరో కొత్త మోడల్ ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. డ్యూయల్ స్క్రీన్ కలిగిన ఫోన్లు మార్కెట్లోకి తెచ్చేందుకు కంపెనీ పని చేస్తున్నట్లు మీడియా వర్గాల ద్వారా తెలిసింది. మెయిన్ స్క్రీన్ తో పాటుగానే అదనంగా బ్యాక్ సైడ్ కూడా మరో ట్రాన్స్పరెంట్ డిస్ప్లే ఉంటుంది. దాన్నే డ్యూయల్ డిస్ప్లే ఫోన్ అంటారు. ఇప్పటికే సాంసంగ్ డ్యూయల్ స్క్రీన్ ఫోన్ యొక్క పేటెంట్ దరఖాస్తు జనవరిలో సమర్పించినట్లు తెలుస్తుంది. సాంసంగ్ కంపెనీ ఈనెల ఆరంభంలో రెండు కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

సాంసంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2022 ఈవెంట్ వేదికగా Galaxy Z Fold 4 మరియు Galaxy Z Flip 4 పేర్లతో ఫోల్డబుల్స్ లాంచ్ చేయబడ్డాయి. Samsung Galaxy Z Fold 4 స్మార్ట్ ఫోన్ 7.6 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేటుకు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెలుపల ఉన్న సెకండరీ డిస్ప్లే 6.2 అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లే గా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 12 OS మద్దతుతో పనిచేస్తుంది. ఇది 12GB RAM,256GB RAM, 16 GB RAM,512GB RAM అంతర్గత నిల్వ ఎంపికలలో కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రధాన కెమెరాలో 50 మెగా పిక్సెల్ సెన్సార్ ఉంది. 16 మెగాపిక్సల్ సెన్సార్ తో అండర్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 25W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4400mAh బ్యాటరీ కలిగి ఉంది.

Two displays new Folding Samsung Mobile

Two displays new Folding Samsung Mobile

Samsung Galaxy Z Flip 4 స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే120Hz రిఫ్రిజిరేటుకు మద్దతు ఇస్తుంది సెకండరీ స్క్రీన్ 2.1 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. Samsung Galaxy Z Flip 4 స్మార్ట్ ఫోన్ Qualcomm Snapdragon 8+Gen1 ప్రాసెసర్ తో అందించబడుతుందని భావిస్తున్నారు. ఇది 12GB RAM మరియు 128 GB/256GB స్టోరేజీలను కూడా కలిగి ఉంటుంది. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో టీవీ ఎల్ కెమెరా సెట్ అప్ ఉంది. ఇది 12 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా మరియు 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ స్నాపర్ని కలిగి ఉంది. ఇది పది మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ని కూడా కలిగి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ 25W వైర్డ్ మరియు 10W వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 3,700mAh బ్యాటరీని కలిగి ఉంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది