
Samantha And Naga Chaitanya : విడాకుల తర్వాత తొలిసారి ఒకే వేదిక పంచుకున్న సమంత, నాగ చైతన్య.. ఫ్యాన్స్ హ్యాపీ..!
Samantha And Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా ఉండే నాగ చైతన్య, సమంత ఎవరు ఊహించని విధంగా విడాకులు తీసుకొని అందరికి పెద్ద షాక్ ఇచ్చారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడానికి కారణాలు ఏంటనేది ఇప్పటి వరకు తెలియదు. వారిద్దరు విడాకులు తీసుకుని రెండున్నరేళ్లు దాటిన కూడా వారికి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. అయితే వారిద్దరు ఏవి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నారు. విడాకుల తర్వాత వారిద్దరు ఒక్కసారి కూడా కలిసి కనిపించింది లేదు. అయితే తాజాగా ఓ ఈవెంట్‌లో మాత్రం వీరిద్దరు ఒకే వేదికని పంచుకోవడం చర్చనీయాంశం అయింది.
మార్చి 19నముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి సమంత , నాగచైతన్య ఇద్దరూ హాజరయ్యారు. అయితే ఒకే ఈవెంట్ కు వారిద్దరు వచ్చినా కూడా వేదికపైకి మాత్రం వేర్వేరు సందర్భాల్లో కనిపించారు. అయితే ఇద్దరు ఒకేసారి వస్తే రియాక్షన్ ఎలా ఉండేదో అని జనాలు ముచ్చటించుకుంటున్నారు. అయితే వారు వేర్వేరు సందర్భాలలో ఒకే వేదిక పంచుకోవడానికి కారణం ఏంటంటే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’తో సమంత, నాగ చైతన్య చేతులు కలిపిన విషయం మనకు తెలిసిందే. నాగ చైతన్య నటించిన ‘ధూత’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి హిట్ అయిన విషయం మనకు తెలిసిందే.
ఇక సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ కూడా అమెజాన్‌లో విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు సమంత నటించిన ‘సిటాడెల్ హనీ బానీ’ కూడా ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లోనే స్ట్రీమింగ్ కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగ చైతన్య ‘ధూత’ వెబ్ సిరీస్ విజయంపై మాట్లాడాడు. ఆ తర్వాత సమంత మాట్లాడింది. ఒకే ఈవెంట్‌కి వచ్చిన వారిద్దరు కలిసి కనిపించకపోవడంతో వారి అభిమానులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. కాగా నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ టైటిల్ తో ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు చందూ మొండేటి రూపొందిస్తున్న ఈ మూవీలో నాగ చైతన్య జాలరి రోల్ చేస్తున్నాడు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.