Rashmi Gautam : యాంకర్ రష్మీని దారుణంగా అవమానించేశారు!.. తెలుగు భాషపై సెటైర్లు

Authored By Cinema Desk | The Telugu News | Updated on: January 6, 2022, 3:01 pm

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై ప్రతి పండుగకు ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేయడానికి మల్లెమాల ప్రొడక్షన్ ముందు వరుసలో ఉంటుంది. ఇలా ప్రతి పండుగకు ఒక స్పెషల్ ఈవెంట్ ద్వారా బుల్లితెర నటీనటులను ఆహ్వానించి పెద్ద ఎత్తున సంబరాలను జరుపుతారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా అమ్మమ్మగారి ఊరు అనే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేయడంతో ఇది వైరల్ గా మారింది.

ఇక ఈ కార్యక్రమంలో సీనియర్ నటీనటుల అయిన బాబు మోహన్ అన్నపూర్ణ ప్రేక్షకులను సందడి చేశారు. అలాగే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇతర ఆర్టిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పాటలు డాన్సులతో ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందించ బోతున్నారని ఈ ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఇక ఈ ప్రోమోలో భాగంగా సంక్రాంతి అవార్డ్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది.

Satires on Rashmi Gautam about her telugu language in ammamma gari ooru latest promo

Satires on Rashmi Gautam about her telugu language in ammamma gari ooru latest promo

Rashmi Gautam : ఉత్తమ తెలుగుతేజం అవార్డు పొందిన రష్మీ..

ఈ సంక్రాంతి అవార్డ్స్ లో భాగంగా యాంకర్ రష్మికి ఉత్తమ తెలుగు తేజం అవార్డు గెలుచుకున్నట్లు యాంకర్ ప్రదీప్ చెప్పడంతో వెంటనే రష్మి అంటే ఏంటి అని అడుగగా వెంటనే రోజా తెలుగు తేజం అంటూ సమాధానం చెప్పడంతో రష్మి దాన్ని నేను తేజస్వి చేస్తున్నానా అంటూ రష్మీ తెలుగు భాషపై మాట్లాడటంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఇలా ఆమె ఉద్దేశపూర్వకంగానే తెలుగు భాష గురించి వ్యంగంగా మాట్లాడటం ఈమె తెలుగు భాష పై సెటైర్లు వేస్తూ అందరిని కడుపుబ్బ నవ్వించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp