SSC Exams : ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఎప్ప‌టి నుండి పరీక్ష‌లు అంటే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

SSC Exams : ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఎప్ప‌టి నుండి పరీక్ష‌లు అంటే…

SSC Exams : క‌రోనా వ‌ల‌న గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ప‌రీక్ష‌లు స‌జావుగా సాగ‌డం లేదు. అయితే ఈ ఏడాది పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షలు మే 11, 2022న ప్రారంభం కానున్నాయి. చివరి పరీక్ష మే 20, 2022తో ముగియనుంది. థర్డ్​ వేవ్​ కూడా ముగిసిందని ఇటీవలె వైద్యారోగ్య శాఖ సంచాలకులు సైతం ప్రకటన చేయడంతో ఇక పరీక్షలకు అడ్డంకి లేకుండా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :11 February 2022,7:30 pm

SSC Exams : క‌రోనా వ‌ల‌న గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ప‌రీక్ష‌లు స‌జావుగా సాగ‌డం లేదు. అయితే ఈ ఏడాది పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షలు మే 11, 2022న ప్రారంభం కానున్నాయి. చివరి పరీక్ష మే 20, 2022తో ముగియనుంది. థర్డ్​ వేవ్​ కూడా ముగిసిందని ఇటీవలె వైద్యారోగ్య శాఖ సంచాలకులు సైతం ప్రకటన చేయడంతో ఇక పరీక్షలకు అడ్డంకి లేకుండా పోయింది.

scc board has released tenth class exams 2022 dates

scc board has released tenth class exams 2022 dates

పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్‌..

* 11-05-2022 ఫస్ట్‌ లాంగ్వేజ్‌ ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు ఉంటుంది.

* 12-05-2022 సెకండ్‌ లాంగ్వేజ్‌ ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు ఉంటుంది.

* 13-05-2022 థార్డ్‌ లాంగ్వేజ్‌ (ఇంగ్లిష్‌) ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు ఉంటుంది.

* 14-05-2022 మ్యాథమెటిక్స్‌ ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు ఉంటుంది.

* 16-05-2022 జనరల్‌ సైన్స్‌ పేపర్ (ఫిజికల్‌, బయోలాజికల్‌ సైన్స్‌) ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు ఉంటుంది.

* 17-05-2022 సోషల్‌ స్టడీస్‌ ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు ఉంటుంది.

* 18-02-2022 ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 1, (సంస్కృతం, అరబిక్‌) ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు ఉంటుంది.

* 19-05-2022 ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 2 (సంస్కృతం, అరబిక్‌) ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు ఉంటుంది.

* 20-05-2022 ఎస్‌ఎస్‌సీ వొకేషనల్ కోర్స్‌ (థియరీ) ఉదయం 9:30 గంటల నుంచి 11:30 వరకు ఉంటుంది.

తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ కి సంబంధించి ఇటీవలె కీలక ప్రకటన చేసింది. ఇంటర్​ విద్యార్థులకు మార్చిలో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం సిలబస్‌లో 70 శాతం ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించి, త్వరలోనే షెడ్యూల్‌ను విడుదల చేయాలని తెలంగాణ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కరోనా ప్రభావం పెద్దగా లేకపోవడం, కాలేజీలో తిరిగి తెరుచుకోవడంతో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పారు. 70 శాతం సిలబస్ ఆధారంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక పరీక్ష పత్రంలోనూ కీలక మార్పులు ఉంటాయంటున్నారు.

Also read

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది