Schools Open : బడి రెడీ.. కరోనా నిబంధనలతో నేటి నుంచి స్కూల్స్ పున:ప్రారంభం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Schools Open : బడి రెడీ.. కరోనా నిబంధనలతో నేటి నుంచి స్కూల్స్ పున:ప్రారంభం..!

 Authored By mallesh | The Telugu News | Updated on :1 February 2022,7:00 am

Schools Open : నేటి నుంచి రాష్ట్రంలో పాఠశాలలతో పాటు అన్ని విద్యా సంస్థల పున:ప్రారంభం కానున్నయి. కొవిడ్ కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో థర్డ్ వేవ్ ఎఫెక్ట్ పిల్లలపైన పడకుండా ఉండేందుకుగాను తెలంగాణ రాష్ట్ర సర్కారు సంక్రాంతి సెలవులను పొడిగించింది. దాంతో విద్యార్థులు 24 రోజుల పాటు ఇళ్లకు పరిమితమయ్యారు. ప్రస్తుతం వైరస్ కంట్రోల్ లోకి వచ్చిందని అంచనా వేసుకున్న వైద్య శాఖ.. స్కూల్స్ పున: ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.విద్యా శాఖ అధికారుల మేరకు పాఠశాలల్లో క్లోరినేషన్, పారి శుధ్య కార్యక్రమాలు చేపట్టనున్నారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని విద్యా శాఖ అధికారులు పాఠశాలల యాజమాన్యాలకు సూచించింది.

విద్యార్థులకు శానిటైజర్, మాస్క్ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులు ఆదేశించారు.ఇకపోతే కొద్ది రోజుల పాటు ఆన్ లైన్ క్లాసులు విన్న విద్యార్థులు.. దాదాపు నెల రోజుల తర్వాత ప్రత్యక్షంగా పాఠాలు విననున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఇప్పటికే ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి కాగా, అర్హులైన విద్యార్థులకూ టీకాలు వేసేందుకుగాను ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నది. 15 నుంచి 18 ఏళ్ల స్టూడెంట్స్ అందరికీ టీకాలు అందేలా చర్యలు తీసుకోనున్నారు. విద్యా సంస్థల్లో ఈ మేరకు వ్యాక్సినేషన్ సెంటర్లనూ ఏర్పాటు చేయనున్నారు.కొవిడ్ కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో స్కూల్స్, కాలేజెస్, విద్యా సంస్థల్లో భౌతిక దూరం పాటించేందుకుగాను ఏర్పాట్లు చేస్తున్నారు.

schools re open from today

schools re open from today

Schools Open : కఠినంగా కొవిడ్ రూల్స్.. శానిటైజర్, మాస్క్ మస్ట్..

తరగతి గదుల్లో భౌతికం దూరం కంపల్సరీగా పాటించేలా జాగ్రత్త పడుతున్నారు. విద్యార్థులలో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉన్నట్లయితే వారికి సెలవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు ఎక్కువ కాలం పిల్లలు ఇంటి వద్దే ఉంటే చదువుపై ఆసక్తి తగ్గిపోతుందని అభిప్రాయపడుతున్నారు. వారు తప్పకుండా తమ పిల్లలను పాఠశాలలకు పంపించే అవకాశాలున్నాయి. అయితే, మరి కొందరు పిల్లల తల్లిదండ్రులు కొవిడ్ వైరస్ భయాల వలన స్టార్టింగ్ నాలుగు లేదా ఐదు రోజుల పాటు పిల్లలను స్కూల్స్‌కు పంపించకపోవచ్చు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది