Schools Open : తెలంగాణలో తెరుచుకోనున్న విద్యా సంస్థలు.. ఎప్పటి నుంచంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Schools Open : తెలంగాణలో తెరుచుకోనున్న విద్యా సంస్థలు.. ఎప్పటి నుంచంటే..?

Schools Open: తెలంగాణలో విద్యా సంస్థలు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఆ మేరకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరవాలని నిర్ణయించినట్టుగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కరోనా కేసుల నేపథ్యంలో… విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని సూచించారు. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టనప్పటికీ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ యేడు విద్యా […]

 Authored By inesh | The Telugu News | Updated on :29 January 2022,5:30 pm

Schools Open: తెలంగాణలో విద్యా సంస్థలు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఆ మేరకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరవాలని నిర్ణయించినట్టుగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కరోనా కేసుల నేపథ్యంలో… విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని సూచించారు.

కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టనప్పటికీ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ యేడు విద్యా సంవత్సరాన్ని పొడిగించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై మాత్రం తెలంగాణ ప్రభుత్వం నుంచి గానీ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి నుంచి గానీ ఏలాంటి ప్రకటన రాలేదు.

 Schools will open again from February 1st in Telangana

Schools will open again from February 1st in Telangana

విద్యా సంస్థలకు సంక్రాంత్రికి ముందు కరోనా కేసుల దృష్ట్యా ప్రకటించిన సెలవులు.. మరో రెండు రోజుల్లో ముగియనున్న క్రమంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేయగా ఆ మేరకు రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నీ సిద్ధం అవుతున్నాయి.

inesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది