schools re open from today
Schools Open : నేటి నుంచి రాష్ట్రంలో పాఠశాలలతో పాటు అన్ని విద్యా సంస్థల పున:ప్రారంభం కానున్నయి. కొవిడ్ కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో థర్డ్ వేవ్ ఎఫెక్ట్ పిల్లలపైన పడకుండా ఉండేందుకుగాను తెలంగాణ రాష్ట్ర సర్కారు సంక్రాంతి సెలవులను పొడిగించింది. దాంతో విద్యార్థులు 24 రోజుల పాటు ఇళ్లకు పరిమితమయ్యారు. ప్రస్తుతం వైరస్ కంట్రోల్ లోకి వచ్చిందని అంచనా వేసుకున్న వైద్య శాఖ.. స్కూల్స్ పున: ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.విద్యా శాఖ అధికారుల మేరకు పాఠశాలల్లో క్లోరినేషన్, పారి శుధ్య కార్యక్రమాలు చేపట్టనున్నారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని విద్యా శాఖ అధికారులు పాఠశాలల యాజమాన్యాలకు సూచించింది.
విద్యార్థులకు శానిటైజర్, మాస్క్ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులు ఆదేశించారు.ఇకపోతే కొద్ది రోజుల పాటు ఆన్ లైన్ క్లాసులు విన్న విద్యార్థులు.. దాదాపు నెల రోజుల తర్వాత ప్రత్యక్షంగా పాఠాలు విననున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఇప్పటికే ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి కాగా, అర్హులైన విద్యార్థులకూ టీకాలు వేసేందుకుగాను ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నది. 15 నుంచి 18 ఏళ్ల స్టూడెంట్స్ అందరికీ టీకాలు అందేలా చర్యలు తీసుకోనున్నారు. విద్యా సంస్థల్లో ఈ మేరకు వ్యాక్సినేషన్ సెంటర్లనూ ఏర్పాటు చేయనున్నారు.కొవిడ్ కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో స్కూల్స్, కాలేజెస్, విద్యా సంస్థల్లో భౌతిక దూరం పాటించేందుకుగాను ఏర్పాట్లు చేస్తున్నారు.
schools re open from today
తరగతి గదుల్లో భౌతికం దూరం కంపల్సరీగా పాటించేలా జాగ్రత్త పడుతున్నారు. విద్యార్థులలో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉన్నట్లయితే వారికి సెలవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు ఎక్కువ కాలం పిల్లలు ఇంటి వద్దే ఉంటే చదువుపై ఆసక్తి తగ్గిపోతుందని అభిప్రాయపడుతున్నారు. వారు తప్పకుండా తమ పిల్లలను పాఠశాలలకు పంపించే అవకాశాలున్నాయి. అయితే, మరి కొందరు పిల్లల తల్లిదండ్రులు కొవిడ్ వైరస్ భయాల వలన స్టార్టింగ్ నాలుగు లేదా ఐదు రోజుల పాటు పిల్లలను స్కూల్స్‌కు పంపించకపోవచ్చు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.