Ysrcp
AP Nominated Posts : ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల AP Nominated Posts ను భర్తీ చేశారు సీఎం జగన్. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని గొప్పగా చెప్పారు మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించామని తెలిపారు. నామినేటెడ్ పదవుల లెక్క చూసిన వారు నిజమే అనుకునేలా కవరింగ్ ఇచ్చారు. తీరా ఏ పోస్టులు ఎవరికి దక్కాయో చూస్తే అసలు సంగతి బయటపడింది. నిధులు ఎక్కువగా ఉండే కార్పొరేషన్లను రెడ్లకు కట్టబెట్టి.. అసలు కార్యాలయాలే లేని కార్పొరేషన్లు, బడ్జెట్ ఎంతో తెలియని, ఆ పోస్టు అంటూ ఉందని కూడా తెలియని నామినేటెడ్ పోస్టులను బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చారన్నది తేలిపోయింది.
ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీఐఐసీ, పెద్ద దేవస్థానాలు, పర్యాటకం, స్పోర్ట్స్, మార్క్‌ఫెడ్, మారిటైం బోర్డ్, సివిల్ సప్లైస్, పోలీస్ హౌసింగ్, APCOB, రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి వంటి కీలక పదవులన్ని రెడ్డి వర్గానికే ఇచ్చారు. నామినేటెడ్ పోస్టుల్లో అత్యంత కీలకం ఏపీఎస్ ఆర్టీసీ. గతంలో మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ఈ పదవిని నిర్వహించారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ పోస్టును మల్లికార్జున రెడ్డికి ఇచ్చారు వైఎస్.జగన్.
secrets behind AP Nominated Posts
మరో కీలక పోస్టు ఏపీఐఐసీని ఇప్పటివరకు మంత్రి పదవి ఆశించి భంగపడిన ఎమ్మెల్యే రోజా ఈ పదవిని నిర్వహించారు. మంత్రి పదవి ఇవ్వలేకపోయిందుకు కీలకమైన ఈ పోస్టును కట్టబెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా ఏపీఐఐసీ చైర్మన్ పోస్టును మెట్టు గోవిందరెడ్డికి కట్టబెట్టారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీశైలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా రెడ్డివారి చక్రపాణిరెడ్డిని నియమించారు. నిధులు ఎక్కువగా ఉండే సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టును ద్వారంపూడి భాస్కర్ రెడ్డికి ఇచ్చారు. కీలకమైన ఏపీ మారిటైం బోర్డ్ ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డిని నియమించారు.
బడ్జెట్ భారీగా ఉండే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మెట్టుకూరు చిరంజీవిరెడ్డి అపాయింట్ అయ్యారు. స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ పదవిని బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి అప్పచెప్పారు. జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్ పోస్టులను వివిధ వర్గాలను పంచేసిన వైఎస్ జగన్ Ys jagan సర్కార్.. రాష్ట్ర స్థాయిలో కీలకమైన అప్కాబ్ చైర్మెన్ పోస్టును మాత్రం మల్లెల ఝాన్సీరెడ్డికి, మార్క్‌ఫెడ్ ఛైర్మన్ పదవిని పమిరెడ్డిగారి పెద్దనాగిరెడ్డికి కట్టబెట్టారు. కీలకమైన పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఆరెమండ వరప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కోడూరు అజయ్‌రెడ్డి, రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.షర్మిలారెడ్డిని నియమించారు. కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా కోట్ల హర్షవర్ధన్‌రెడ్డిని అపాయింట్ చేశారు.
Ys jagan
ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అన్ని కీలక పదవుల్లో రెడ్డిగార్లకు పెద్ద పీట వేసిన వైఎస్ జగన్ Ys Jagan తన స్పీచ్ లో మాత్రం రెడ్డిగార్లను పక్కనపెట్టి బలహీనవర్గాలు, మహిళల గురించి వాయించేస్తున్నారు. ఆఖరికి కీలకమైన అధికారిక పదవుల్లో కూడా వారినే ఏరికోరి వేయిస్తున్నారు. పై నుంచి కింద వరకు కీలక పదవులన్నిటిలో వారే నిండిపోయారు. ఏపీలో జగన్ సర్కార్ ఇవాళ ప్రకటించిన నామినేటెడ్ పదవులపై టీడీపీ పెదవి విరిచింది.
నామినేటెడ్ పదవుల ప్రకటనతో సామాజిక న్యాయం చేస్తున్నట్లు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల చేస్తున్న ప్రకటనలపై మండిపడ్డారు. దాదాపు 26 కీలక సంస్థలకు ఛైర్మన్లుగా సొంత సామాజికవర్గ నేతల్ని నియమించి పల్లకీలో ఊరేగిస్తూ.. అప్రాధాన్యత కలిగిన పదవులను బడుగు బలహీన వర్గాలకు కట్టబెట్టడమే సామాజిక న్యాయమా. అని ప్రశ్నించింది. నిధులు లేని కార్పొరేషన్లు.. కుర్చీల్లేని ఛైర్మన్ల నియామకంతో సామాజిక న్యాయం ఏ విధంగా జరిగిందోనని సెటైర్లు వేస్తోంది.
ఇది కూడా చదవండి ==> టీడీపీకి భారీ షాక్ ఇచ్చిన సీనియర్ నేత.. ఆ సీటు కోసమే వైసీపీలోకా…?
ఇది కూడా చదవండి ==> వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి మధ్య గ్యాప్…? కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు?
ఇది కూడా చదవండి ==> ఈ మూడు జిల్లాలతో వైఎస్ జగన్‌కు తిప్పలు తప్పదా…?
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.