TDP : టీడీపీకి భారీ షాక్ ఇచ్చిన సీనియర్ నేత.. ఆ సీటు కోసమే వైసీపీలోకా…?
TDP విజయనగరం : వరుస ఓటములతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీడీపికి మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత.. ప్రజల్లో మంచి పట్టు ఉండి.. టీడీపీ TDP లో కీలక పదవులు అనుభవించిన కీలక నేత, ఎస్ కోట మాజీ ఎమ్మెల్యే శోభ హైమవతి Shobha Hymavathi ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ Shobha Hymavathi లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీకి కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బై బై చెప్పేసి వైసీపీకి మద్దతిచ్చారు. వారి కుటుంబ సభ్యులకు కండువాలు కప్పించేశారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ద్వితియ శ్రేణి నేతలు వైసీపీ కండువాలు కప్పేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది.
ఓ వైపు పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు టీడీపీ TDP అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంటే.. ఇదే సమయంలో పార్టీకి చెందిన కీలక నేత రాజీనామా చేయడం సంచలనంగా మారింది. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి Shobha Hymavathi టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. గతంలో తెలుగు మహిళా అధ్యక్షురాలిగా శోభా హైమావతి పనిచేశారు.
పక్కన పెట్టేశారని.. TDP Shobha Hymavathi
అయితే ఇప్పటికే శోభా హైమావతి Shobha Hymavathi కూతురు స్వాతి వైసీపీలో కొనసాగుతున్నారు. తన కూతురు పార్టీ మారితే.. తనను టీడీపీకి దూరం పెట్టడం సరికాదని శోభా హైమావతి చెప్పుకొచ్చారు. అయినా అధిష్టానం శోభా హైమావతిని పట్టించుకోవడం లేదు. గత ఎన్నికల్లో శోభా హైమావతి తీరు కారణంగానే పార్టీ అక్కడ ఓడిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో శోభా హైమావతిని అధిష్టానం చూసి చూడనట్టు వదిలేసింది. దీంతో శోభా హైమావతి రాజీనామాకు సిద్ధమయ్యారు.
టీడీపీ TDP లో సీనియర్ నేతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పని చేసిన శోభా హైమావతి 1999లో ఎస్.కోట నియోజకవర్గం నుంచి ఎస్టీ అభ్యర్థిగా తొలి ప్రయత్నంలోనే శోభా హైమావతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్ధి కుంభ రవిబాబు చేతిలో ఓటమి చెందారు. అదే ఏడాది శోభా హైమావతి ఎస్టీ కాదంటూ కోర్టు తీర్పు వచ్చింది. 2009లో సామాజిక సమీకరణాల్లో ఎస్. కోట అసెంబ్లీ సీటు త్యాగం చేసిన శోభా హైమావతి అప్పటినుంచి పార్టీకి సేవలు అందిస్తూ వచ్చారు.
వైసీపీలోకి .. TDP – Ysrcp Shobha Hymavathi
2014లో శోభా హైమావతి కుమార్తె శోభా స్వాతిరాణికి జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల తరువాత శోభా హైమావతి కూతురు స్వాతిరాణి వైసీపీలో చేరారు. ఆమె భర్త గుల్లిపల్లి గణేష్ ఎన్నికల నాటి నుండి ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్నారు. శోభా హైమావతి తన కుమార్తె భవిష్యత్ కోసం పార్టీని వీడినట్టు తెలుస్తోంది. శోభా హైమావతి త్వరలోనే వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, శోభా హైమావతి కుమార్తె, వైసీపీ నేత స్వాతిరాణికి ఆ పార్టీ జీసీసీ ఛైర్మన్ పోస్టును ఇచ్చింది.
అయితే శోభా స్వాతిరాణి అరకు ఎంపీపై ఆశలు పెట్టుకుని, అధికార పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమెకు నామినేటెడ్ పోస్టు ఇవ్వడంతో, ఇక ఈ సీటు దక్కనట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేయడంతో వైసీపీలోకి వెళతారన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అరకు ఎంపీ సీటును శోభా హైమావతి డిమాండ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై వైసీపీ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే .