Self Employment : జాబ్ మానేసి ఇంటి వద్దే నెలకు రూ.80 వేల సంపాదన.. ఏం చేస్తున్నాడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Self Employment : జాబ్ మానేసి ఇంటి వద్దే నెలకు రూ.80 వేల సంపాదన.. ఏం చేస్తున్నాడో తెలుసా?

 Authored By kranthi | The Telugu News | Updated on :4 March 2023,8:00 am

Self Employment : ఉద్యోగం ఏముంది.. ఎవరైనా చేస్తారు కానీ.. సొంతంగా బిజినెస్ చేయడం అనేది అందరికీ సాధ్యం కాదు. ఏదో చిన్న ఉద్యోగం చేస్తే చాలు అనుకుంటారు. కానీ.. ఈ యువకుడు మాత్రం జాబ్ వద్దు అని లక్షల జీతం వచ్చే జాబ్ మానేసి ఊరికి వెళ్లిపోయి పుట్టగొడుగుల బిజినెస్ పెట్టి ఇప్పుడు నెలకు రూ.80 వేలు సంపాదిస్తున్నాడు. అతడి పేరు సాయి. గుంటూరు జిల్లా తెనాలి.

left job and started mushroom business in guntur

left job and started mushroom business in guntur

జాబ్ కొన్నాళ్లు చేసినా అతడికి ఎలాంటి సంతృప్తి లేదు. దీంతో వ్యవసాయానికి రిలేటెడ్ గా ఏదైనా ఊరికెళ్లి చేయాలని అనుకున్నాడు. దీంతో పుట్టగొడుగుల బిజినెస్ చేయాలన్న ఉద్దేశంతో దాని ట్రెయినింగ్ కు వెళ్లి ఆ తర్వాత తన సొంతూరు తెనాలిలో మూడేళ్ల కింద పుట్టగొడుగుల బిజినెస్ ను స్టార్ట్ చేశాడు. చిన్న రూమ్ లో బిజినెస్ ను స్టార్ట్ చేసి రోజూ కిలో నుంచి రెండు కిలోలు మాత్రమే పెంచే స్థాయి నుంచి 10 రూమ్స్ లో మష్ రూమ్స్ ను పెంచి రెండు చేతులా సంపాదిస్తున్నాడు సాయి.

Mushroom Maa' transforms a village in Odisha | Mint Lounge

Self Employment : పుట్టగొడుగుల్లో 40 రకాల వెరైటీలు

చాలామంది పుట్టగొడుగులు అంటే ఒకే రకమైనవి ఉంటాయి అని అనుకుంటారు. కానీ.. పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉంటాయట. దాదాపు 40 రకాలు ఉంటాయట. అందులో మిల్కీ పుట్టగొడుగులను ఇంట్లోనే పెంచుతున్నాడు. వాటి విత్తనాలను బెంగళూరు, కేరళ నుంచి తెప్పించి ఇంట్లోనే పుట్టగొడుగులను పెంచుతూ నెలకు వేల రూపాయలు సంపాదిస్తూ స్థానికంగా అందరికీ ఆదర్శంగా నిలిచాడు సాయి. రోజుకు ఇప్పుడు 10 నుంచి 15 కిలోల పుట్టగొడుగులను తీస్తూ నెలకు సీజన్ ఉంటే ఒక్కోసారి లక్ష వరకు సంపాదిస్తున్నాడు సాయి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది