Self Employment : ఉద్యోగమే చేయాల్సిన పని లేదు.. ఈ ఐడియాలను ఫాలో అయితే మీ కంపెనీకి మీరే బాస్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Self Employment : ఉద్యోగమే చేయాల్సిన పని లేదు.. ఈ ఐడియాలను ఫాలో అయితే మీ కంపెనీకి మీరే బాస్..!

Self Employment : ఉద్యోగం చెయ్యటం వేరు. ఉద్యోగం ఇయ్యటం వేరు. ఉద్యోగం చేసేవాళ్లకి ఫ్రీడం ఉండదు. ఒక్క రోజు సెలవు కావాలన్నా నోరు తెరిచి ఇన్ఛార్జ్ ని అడగాలి. లీవ్ దొరుకుతుందా లేదా అనేది అతని దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. పైగా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉద్యోగం అనేది ప్రతిఒక్కరికీ సాధ్యం కాకపోవచ్చు. అదే.. ఉద్యోగం ఇవ్వాలనుకునేవాళ్లకైతే స్వయం ఉపాధి ఉండాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వల్ల ఎన్నో […]

 Authored By kondalrao | The Telugu News | Updated on :13 July 2021,5:50 pm

Self Employment : ఉద్యోగం చెయ్యటం వేరు. ఉద్యోగం ఇయ్యటం వేరు. ఉద్యోగం చేసేవాళ్లకి ఫ్రీడం ఉండదు. ఒక్క రోజు సెలవు కావాలన్నా నోరు తెరిచి ఇన్ఛార్జ్ ని అడగాలి. లీవ్ దొరుకుతుందా లేదా అనేది అతని దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. పైగా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉద్యోగం అనేది ప్రతిఒక్కరికీ సాధ్యం కాకపోవచ్చు. అదే.. ఉద్యోగం ఇవ్వాలనుకునేవాళ్లకైతే స్వయం ఉపాధి ఉండాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వల్ల ఎన్నో లాభ నష్టాలు ఉన్నాయి. బెస్ట్ ఐడియాలను ఆచరణలో పెట్టి హార్డ్ వర్క్ చేస్తే నష్టాలు లాభాలుగా మారతాయి. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు రెండూ సంపాదించొచ్చు. మనకు మనమే బాస్ కావొచ్చు.

self employment top 10 ideas to earn money

self employment top 10-ideas to earn money

ఎలా ప్రారంభించాలి?..

సొంతగా బిజినెస్ ప్రారంభించాలనుకునేవాళ్లు ముందుగా తమ బలాలను, బలహీనతలను గుర్తెరగాలి. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని కొనసాగించాలా? వదిలేయాలా? అనేది నిర్ణయించుకోవాలి. మనకు ఏ వ్యాపారమైతే సెట్ అవుతుందో తేల్చుకోవాలి. ఇండియా.. డెవలపింగ్ ఎకానమీ. కాబట్టి ఇతర దేశాలతో పోల్చితే మన దగ్గర వర్క్ దొరకదనే బెంగ అవసరం లేదు. ఇంటర్నెట్ కారణంగా ప్రపంచమే ఒక కుగ్రామంగా మారింది. దీంతో ప్రతిఒక్కరికీ ఎన్నో అవకాశాలు నెలకొన్నాయి. మన కాళ్ల మీద మనం నిలబడాలి అనుకునేవాళ్లకు 10 బెస్ట్ ఐడియాలు..

ఒకటి.. యాప్ డెవలప్మెంట్ : Self Employment

ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు సగం మంది చేతిలో మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. ప్రతి పనికీ ఒక యాప్ ను వాడుతున్నారు. కాబట్టి కొత్త కొత్త యాప్ లను తయారుచేయాలనుకునేవారికి ఈ రంగంలో శాలరీలు కూడా బాగానే ఇస్తున్నారు.

self employment top 10 ideas to earn money

self employment top 10-ideas to earn money

రెండు.. వెబ్ సైట్ డిజైనింగ్ : Self Employment

ఈ రోజుల్లో ఒక వ్యక్తి ఆధ్వర్యంలో నడిచే కంపెనీలు మొదలుకొని మల్టీ నేషనల్ కంపెనీల వరకు ప్రతి సంస్థకూ ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన వెబ్ సైట్ అవసరం పడుతోంది. కాబట్టి వెబ్ సైట్ డిజైనింగ్ నేర్చుకుంటే ఇంట్లో ఉండే వేలకు వేలు సంపాదించొచ్చు.

మూడు.. డెలివరీ సర్వీస్ బిజినెస్ : Self Employment

ప్రజలు ఇప్పుడు కాలు బయట పెట్టకుండా ప్రతిదీ ఇంటికే తెప్పించుకోవాలని భావిస్తున్నారు. టిఫిన్లు మొదలుకొని నైట్ డిన్నర్ల వరకు, మందులు, కూరగాయలు, నిత్యవసర సరుకులు, కమర్షియల్ ఐటమ్స్.. ఇలా అన్నీ డెలివరి సర్వీస్ బిజినెస్ తోనే సాధ్యమవుతున్నాయి. కాబట్టి ఈ రంగంలో కూడా అవకాశాలకు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంది.

ఇంకా ఎన్నో.. : Self Employment

ఎడిటింగ్ లేదా ప్రూఫ్ రీడింగ్, ఫొటోగ్రఫీ, ఫ్రీలాన్సింగ్, ట్యూషన్ సెంటర్, డిజిటల్ మార్కెటింగ్, బ్యూటీ పార్లర్, టిఫిన్ సెంటర్, ఫుడ్ ట్రక్ బిజినెస్.. ఇలా చాలా రంగాల్లో ఛాన్సలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలోచించి ముందడుగు వేస్తే, ఆచరణలో పెడితే సొంతగా, ఈజీగా డబ్బు సంపాదించొచ్చు.

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది