Shame on Media : ఇదేనా మీ జర్నలిజం.. ఇదేనా మీ వాయిస్.. సిగ్గుమాలిన మీడియా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shame on Media : ఇదేనా మీ జర్నలిజం.. ఇదేనా మీ వాయిస్.. సిగ్గుమాలిన మీడియా..!

 Authored By sukanya | The Telugu News | Updated on :15 September 2021,2:30 pm

మానవత్వం మంటగలిసింది. అభం శుభం తెలియని చిన్నారిపై హత్యాచారం జరిగినా, కనీసం స్పందించలేని దుస్థితి. ఘటన వివరాలు తెలిపి, తమ డ్యూటీ చేశామని విర్రవీగుతోన్న జర్నలిజం పెద్దలకు .. కనీసం నిందితుడ్ని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ చేయాలన్న తలంపు కూడా రాకపోవడాన్ని ఏమనాలి.. అదే సమయంలో నటుడు సాయి థరమ్ తేజ్ ప్రమాదాన్ని చిలువలుపలువలుగా వర్ణించి, దానిపై గంటకో హెల్త్ బులెటిన్లు ఇస్తోన్న మీడియా తీరు సర్వత్రా మరోసారి చర్చకు కారణమవుతోంది. రేటింగ్స్ .. వ్యూవర్ షిప్ కోసం ఏంచేసేందుకైనా వెనకాడని మీడియాకు ..

shame on media

shame-on-media

పాలుగారే పసిపాప .. కన్నీటి వేదన కనిపించకపోవడం శోచనీయం.. Shame on Media

పాలుగారే పసిపాప .. కన్నీటి వేదన కనిపించకపోవడం శోచనీయం.. కనీసంలో కనీసంగానైనా నిందితుల్ని పట్టుకుని, శిక్షించాలని డిమాండ్ చేయకపోవడం.. కన్నా దారుణం మరొకటి ఉంటుందా.. సమాజంలో పెల్లుబికుతున్న ఇటువంటి వక్రపోకడల్ని తమ గళం ద్వారా అడ్డుకట్ట వేయాల్సిన సమాచార సంస్థలు.. మూగనోము పట్టడం దేనికి సంకేతమన్న ప్రశ్న వెల్లువెత్తుతోంది. సమాజ బాధ్యతల్ని తన భుజాలపై ఎత్తుకున్నమీడియా ..ఇప్పుడెందుకు సైలెంట్ అవుతోంది. ఏమీ తెలియని పసిమొగ్గ జీవితాన్ని చిదిమేసిన కంటకుడ్ని బహిరంగంగా ఉరి తియ్యాలని నినదించాల్సిన మీడియా.. మౌనవ్రతానికి కారణాలేమిటి.. ఈ సమస్య మీడియా పెద్దలదా.. లేక కనీసం సామాజిక స్పృహ లేకుండా, జీతం డబ్బులకు పనిచేసే వారిదా..

shame on media

shame-on-media

గతంలో ఇటువంటి ఘటనలపై ఏకతాటిపై నినదించిన మీడియా .. రేటింగుల బాట పట్టడం ఎంతవరకు సమంజసం.. కనీసపు విలువల్ని కూడా సమాచార సంస్థలు పాటించలేనంత దుస్థితి తలెత్తిందా.. ముక్కుపచ్చలారని పసిపాప.. నరకయాతన కనిపించడం లేదా.. సమాజంలో మీడియాకు ఉన్న గౌరవం.. అప్పనంగా ఇచ్చింది కాదన్న విషయాన్ని ముందు మీడియా పెద్దలు గుర్తించాలి.. చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే, గన్ను కన్నా పెన్ను ఎంత గొప్పదో అర్థమవుతుంది. స్వాతంత్ర్య పోరాటంలో మహామహులకు ఆలంబనగా మారిన మీడియా .. ఇప్పుడు కనీస స్పందన లేకుండా పోవడం .. ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. సమాజ హితానికి పాటుపడుతూ, సమాజ శ్రేయస్సే తమ పరమావధిగా బతికిన మీడియా ఇప్పుడు కనీస విలువలు కోల్పోతోందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది.

 

shame on media

shame-on-media



మానవత్వాన్నిపాదుకొల్పేలా.. సాగిన కథనాలు.. ఎందుకు మూగనోము పడుతున్నాయి..? సమస్యల్ని వెలికితీస్తూ, మానవీయ కోణంలో వీక్షించే దృష్టిని మీడియా కోల్పోయిందా..? సమాజంలో జరుగుతోన్న ఘటనల్ని నిత్యం అందించే మీడియా.. కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించడంపై సర్వత్రా నిరసనలు రేగుతున్నాయి.. సెలబ్రెటీల వార్తలే ప్రామాణికంగా.. సామాన్యుల ప్రాణాలు తృణప్రాయంగా భావించే మీడియా తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జర్నలిజం పోకడలు మారుతున్నాయి.. లేటెస్ట్ టెక్నాలజీలు వస్తున్నాయి.. కానీ కనీసపు విలువల్ని మాత్రం కోల్పోకూడదన్న వాదన గళమెత్తే రోజు రానుంది..

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది