Kadapa..రాష్ట్రప్రభుత్వ మొండి పట్టుదల సరికాదు: సీఐటీయూ నాయకులు

0
Advertisement

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నది. ఈ క్రమంలోనే టీకా డ్రైవ్‌ల పేరిట ప్రభుత్వం ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఏఎన్ఎంలపై పనిభారం మోపుతున్నదని సీఐటీయూ నాయకులు ఆదివారం ఆరోపించారు. ఈ సందర్భంగా వారు జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఏఎన్ఎంలకు పని భారం తగ్గించాలని కోరారు. ప్రభుత్వం పని భారం తగ్గించని పక్షంలో పెద్దఎత్తున పోరాటాలకు దిగుతామని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎ.రామ్మోహన్, సీఐటీయూ కడప జిల్లా కార్యదర్శి అబ్బవరం రామాంజులు తెలిపారు.

వ్యాక్సినేషన్ విషయమై ఏఎన్ఎంలకు పనిభారం పెంచే విషయంలో ప్రభుత్వ మొండి పట్టుదల సరికాదని చెప్పారు. కొవిడ్ కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో థర్డ్ వేవ్ ముప్పు తగ్గించేందుకుగాను టీకాలు ప్రతీ ఒక్కరికి అందజేయడం మంచిదేనని, కానీ, ఆరోగ్య శాఖ ఏఎన్ఎంలపై ఒత్తిడి, పనిభారం పెంచొద్దని చెప్పారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కలెక్టర్లు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నారు.

 

 

Advertisement