Bus Accident : ట్రావెల్ బస్సుని ఢీకొట్టిన ట్రక్కు.. 40 మంది సజీవ దహనం
ప్రధానాంశాలు:
Bus Accident : ట్రావెల్ బస్సుని ఢీకొట్టిన ట్రక్కు.. 40 మంది సజీవ దహనం
Bus Accident : మెక్సికోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో mexico bus accident అంతా ఉలిక్కి పడ్డారు.మెక్సికో Mexico లోని దక్షిణ ప్రాంతంలో కాంకున్ నుంచి టబాస్కోకు ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు Travel bus ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో ఈ మంటలు చెలరేగాయి. మృతుల్లో 38 మంది ప్రయాణీకులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతదేహాలను గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి.
![Bus Accident ట్రావెల్ బస్సుని ఢీకొట్టిన ట్రక్కు 40 మంది సజీవ దహనం](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/mexico-bus-accident.jpg)
Bus Accident : ట్రావెల్ బస్సుని ఢీకొట్టిన ట్రక్కు.. 40 మంది సజీవ దహనం
Bus Accident ఘోర ప్రమాదం..
ఇప్పటి వరకు కేవలం 18 మంది మృతదేహాలను మాత్రమే గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.ప్రమాదం జరిగిన సమయంలో బస్సు స్పీడ్ లిమిట్‌లో ఉందని చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు, కానీ బస్సు ఆపరేటర్ Bus Operator ఈ విషయంలో పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి గల మరిన్ని కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం, స్థానిక అధికారులు బాధితుల కుటుంబాలకు అవసరమైన సహాయం అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదంపై టాబాస్కోలోని కమల్‌కాల్కో మేయర్ ఒవిడియో పెరాల్టా స్పందించారు. కాంకున్ నుంచి టబాస్కోకు వెళుతున్న బస్సు ప్రమాదం ఘటనపై చింతిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు.