Shivani Raja : యూకే పార్లమెంట్‌లో భగవద్గీతపై ప్రమాణం చేసిన బ్రిటన్‌ ఎంపీ.. వైర‌ల్ అవుతున్న వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shivani Raja : యూకే పార్లమెంట్‌లో భగవద్గీతపై ప్రమాణం చేసిన బ్రిటన్‌ ఎంపీ.. వైర‌ల్ అవుతున్న వీడియో

Shivani Raja : ఇటీవల జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మహిళా వ్యాపారవేత్త, కన్జర్వేటివ్ పార్టీ నేత శివానీ రాజా చరిత్ర సృష్టించారు. లీసెస్టర్ ఈస్ట్ సీటు నుండి ఎన్నికల బరిలో దిగిన ఆమె ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన రాజేశ్ అగర్వాల్‌పై భారీ మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టించింది. ఈ క్ర‌మంలో దాదాపు 37 ఏళ్ల తరువాత ఆ నియోజకవర్గంలో కన్జర్వేటివ్ పార్టీ గెలుపొందింది.అయితే ఆమె భ‌గ‌వ‌ద్గీత మీద ప్ర‌మాణం చేయ‌డం అందరి […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 July 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Shivani Raja : యూకే పార్లమెంట్‌లో భగవద్గీతపై ప్రమాణం చేసిన బ్రిటన్‌ ఎంపీ.. వైర‌ల్ అవుతున్న వీడియో

Shivani Raja : ఇటీవల జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మహిళా వ్యాపారవేత్త, కన్జర్వేటివ్ పార్టీ నేత శివానీ రాజా చరిత్ర సృష్టించారు. లీసెస్టర్ ఈస్ట్ సీటు నుండి ఎన్నికల బరిలో దిగిన ఆమె ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన రాజేశ్ అగర్వాల్‌పై భారీ మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టించింది. ఈ క్ర‌మంలో దాదాపు 37 ఏళ్ల తరువాత ఆ నియోజకవర్గంలో కన్జర్వేటివ్ పార్టీ గెలుపొందింది.అయితే ఆమె భ‌గ‌వ‌ద్గీత మీద ప్ర‌మాణం చేయ‌డం అందరి దృష్టిని ఆక‌ర్షించింది. గతంలో భారత సంతతి ఎంపీలు అలోక్ శర్మ, రుషి సునక్ లు భగవద్గీతపై ప్రమాణం చేయ‌గా, ఇప్పుడు శివానీ రాజా కూడా అలానే ప్రమాణం చేశారు.

Shivani Raja భగవద్గీతపై ప్రమాణం..

దిగువ సభలో జరిగిన కార్యక్రమంలో శివానీ భగవద్గీతపై ప్రమాణం చేసి తన ఎంపీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం, ఆమె ఎక్స్ వేదిగా తన సంతోషాన్ని పంచుకున్నారు. భగవద్గీత సాక్షిగా బ్రిటన్ రాజు విశ్వసనీయురాలిగా ఉంటానంటూ ప్రమాణం చేయడం తన జీవితంలో మరిచిపోలేని రోజని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి రాజేశ్ అగర్వాల్‌కు 10,100 ఓట్లు రాగా శివానీకి 14526 ఓట్లు పోలయ్యాయి. ఇటీవల టీ20 మ్యాచ్ సందర్భంగా స్థానిక హిందూ, ముస్లిం మతస్తుల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో శివానీ ఎన్నికకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.

Shivani Raja యూకే పార్లమెంట్‌లో భగవద్గీతపై ప్రమాణం చేసిన బ్రిటన్‌ ఎంపీ వైర‌ల్ అవుతున్న వీడియో

Shivani Raja : యూకే పార్లమెంట్‌లో భగవద్గీతపై ప్రమాణం చేసిన బ్రిటన్‌ ఎంపీ.. వైర‌ల్ అవుతున్న వీడియో

ఇక ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మొత్తం 27 మంది దిగువ సభకు ఎంపీలుగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా, రికార్డు స్థాయిలో 263 మంది మహిళలు ఎంపీలుగా గెలుపొందారు. ఇక సభలో శ్వేతజాతీయేతర ఎంపీల సంఖ్య కూడా మునుపెన్నడూ లేని విధంగా 90కి చేరింది. బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టిన లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ దేశాన్ని పునర్నిర్మిస్తానని అన్నారు.. ఆయన సారథ్యంలోని లేబర్ పార్టీ మొత్తం 650 సీట్లకు గాను 412 సీట్లలో ఘన విజయం సాధించింది. ఇక కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని మాజీ ప్రధాని రిషి సునాక్ అన్నారు. ప్రజల్లో ఆగ్రహం, అసంతృప్తి గూడుకట్టుకున్నాయని ఆయన అంగీకరించారు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది