Sunday : ఆదివారం నాడు ఈ పనులు చేశారంటే అష్ట దరిద్రం పట్టుకున్నట్టే.. ఏలినాటి శని తగిలినట్టే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sunday : ఆదివారం నాడు ఈ పనులు చేశారంటే అష్ట దరిద్రం పట్టుకున్నట్టే.. ఏలినాటి శని తగిలినట్టే

 Authored By jagadesh | The Telugu News | Updated on :6 May 2021,5:00 pm

Sunday : ఆదివారం వచ్చిందంటే చాలు.. చికెన్, మటన్.. మటన్ చికెన్, మందు బిర్యానీ, పబ్, ఇలా ఆదివారం రోజున చిల్ అవ్వని మనిషే ఉండడు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్లకు అయితే ఆదివారం వచ్చిందంటే చాలు అది పండుగ రోజు అవుతుంది. అయితే.. మనం ఎంతలా ఆదివారానికి ప్రాధాన్యత ఇస్తామో… సనాతన ధర్మంలోనూ… పురాణ ఇతిహాసాల్లోనూ ఆదివారానికి ప్రత్యేకత ఉంది. ప్రాధాన్యత ఉంది. అందుకే.. అంత ప్రాధాన్యత ఉన్న ఆదివారం రోజున మనం కొన్ని పనులు చేయకూడదట. అవి చేస్తే మహా పాపమట.. అష్ట దరిద్రమట. ఇంతకీ ఏంటా పనులు.. అసలు.. ఆదివారానికి అంత ప్రాముఖ్యత ఎందుకు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

should not do these works on sunday

should not do these works on sunday

మన పూర్వీకులు ఎక్కువగా సుర్యుడిని ఆరాధించేవారు. భారతీయ సంస్కృతి అంటేనే సూర్యుడిని ఆరాధించే సంస్కృతి. భారతీయులు జరుపుకునే పండుగలు కూడా ఎక్కువగా సూర్యుడిని బేస్ చేసుకొనే వచ్చాయి. ఉదయాన్నే నిద్ర లేవడం.. స్నానం చేసి సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుడికి తర్పణాలు వదిలేయడం.. ఇలా… సూర్యుడిని ఆరాధించేవాళ్లు మన పూర్వీకులు. అందుకే.. సూర్యుడికి గుర్తుగా మన పూర్వీకులు పెట్టుకున్న రోజే ఆదివారం. దాన్నే రవివారం అని కూడా అంటారు. రవి అంటే సూర్యుడు. సూర్యుడిని కొలవడం కోసం.. సూర్యుడిని ఆరాధించడం కోసం వారంలో ఒక రోజును మన పూర్వీకులు ఏర్పాటు చేసుకున్నారు. అటువంటి ఆదివారం భారతీయులకు చాలా పవిత్రమైనది.

కానీ.. ఆదివారాన్ని వెనకటి నుంచి ఒక సెలవు దినంగానే మనం చూస్తున్నాం. ఆరోజునే ఎక్కువగా మాంసం తినడం, మద్యం తాగడం.. స్త్రీలతో సాంగత్యం చేయడం లాంటి పనులు చేసి ఆదివారం విశిష్టతను దెబ్బతీస్తున్నాం. ఆదివారం అంటే రెస్ట్ తీసుకునే రోజని చెప్పి.. ఆదివారం రోజున పెందలాడే లేవకపోవడం, బాగా తిని తొంగోవడం.. మాంసం, మద్యం తాగడం లాంటివి చేసి ఆదివారాన్ని అపవ్రితం చేస్తున్నాం.

Sunday

Sunday

Sunday : మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదించేదే సూర్యుడు

నిజానికి మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదించేది సూర్యుడే. మనిషి మీద సూర్య కిరణాలు పడితే చాలు.. చాలా రోగాలు నయం అయిపోతాయి. చిన్నపిల్లలను కూడా ఎక్కువగా సూర్యరశ్మి తగిలేలా పడుకోబెడతారు. సూర్యుడు మనిషి లైఫ్ లో చాలా ముఖ్యం. సూర్యుడు లేకపోతే మనిషే లేడు. అందుకే.. సూర్యుడిని ఖచ్చితంగా ఆదివారం రోజున కొలవాల్సిందే. అలా కాదని.. ఆదివారం రోజున ఇష్టమున్నట్టు చేయడం, స్నానం చేయకపోవడం, తెల్లవారుజామునే లేవకపోవడం, మద్యం, మాంసం తినడం, తాగడం.. లాంటివి చేస్తే దరిద్రం చుట్టుకుంటుందట. ఏ పని చేసినా కాదట. ఇంకా జన్మజన్మలకు దరిద్రులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. దరిద్రం అంటే డబ్బు లేకపోవడమే కాదు.. జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు రావడం, అనారోగ్యం దరిచేరడం… ఇవన్నీ.. ఆదివారం చేసే తప్పుల వల్లనే అని పురాణాల్లో రాసి ఉంది. అందుకే.. ఇకనైనా ఆదివారం రోజున అటువంటి పనుల చేయకుండా.. సూర్యుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది