Hindu Dharma : సనాతన ధర్మంలో పెద్దల కాళ్లకు నమస్కారం చేయడానికి గల అసలు కారణం ఇదే…!
ప్రధానాంశాలు:
Hindu Dharma : సనాతన ధర్మంలో పెద్దల కాళ్లకు నమస్కారం చేయడానికి గల అసలు కారణం ఇదే...!
Hindu Dharma : భారతీయ హిందూ సంప్రదాయాలలో కుటుంబ పెద్దలతో పాటు ఎవరైనా పెద్దలు కనిపిస్తే వంగి వాళ్ళ కాళ్లకు చేతులతో నమస్కారం చేయడం అనేది ఎప్పటినుండో వస్తున్నన ఆచరణ. అలాగే గురువులకు పెద్దలకు మరియు దైవ సమానులుగా భావించే వారి కాళ్ళకు దణ్ణం పెట్టడం సనాతన హిందూమతంలోని సంప్రదాయాల చిహ్నం. హిందూ సాంప్రదాయాలకు గొప్ప విశిష్టత ఉంది. అయితే పెద్దలపై తమ గౌరవాన్ని వ్యక్తం చేయడం కోసం చేతులతో నమస్కరించడం మరియు కాళ్లకు నమస్కరించడం వంటివి చేస్తారు. హిందూ మతంలో దేవతలకు నమస్కారిస్తే ఎలాంటి ఆశీస్సులు పొందుతారో అదేవిధంగా హిందూ సంప్రదాయంలో భగవంతుని స్థానంలో తల్లిదండ్రులకు ,పెద్దలకు , గురువుల పాదాలకు చేతులతో నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇలా చేయడం వలన వారికి శుభం కలుగుతుంది అని నమ్మకం.
ప్రతిరోజు తల్లిదండ్రులను నమస్కరించడం వలన చెడు ప్రభావం పోతాయి. అయితే ఇది మతపరమైన సాంప్రదాయమే కాకుండా దీని ద్వారా మరికొన్ని శాస్త్రీయమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు మన వివరంగా తెలుసుకుందాం. హిందూమతంలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా జీవితంలోని సమస్యలను దూరం చేస్తుందని అలాగే ఆనందాన్ని కలిగిస్తుందని చెబుతారు. సాధారణంగా పెద్దలు తమ పాదాలకు నమస్కరించిన వారికి ఆశీర్వాదం ఇస్తూ.. “సుఖ సంతోషాలతో ఉండండి.. ఆర్ధికంగా లోటు లేకుండా జీవించండి” అని దీవిస్తారు. అదేవిధంగా పెళ్లి తర్వాత నూతన వధూవరులు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు.
అప్పుడు పెద్దలు” దీర్ఘ సుమంగళీభవ సంతాన ప్రాప్తిరస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు” అంటూ దీవెనలు ఇస్తారు. చాలామంది పెద్దలు పిల్లలకు ఆశీర్వాదం ఇస్తూ సుఖ సంతోషాలు సిరి సంపదలతో జీవించాలని కోరుకుంటూరు. అయితే స్త్రీలకు లేదా వధువులకు మాత్రమే దీర్ఘ సుమంగళీభవ సంతాన ప్రాప్తిరస్తు వంటి దీవెనలు ఎందుకు ఇస్తారంటే కోడలు పెళ్లయి అత్తవారింటిలో అడుగు పెట్టిన తరువాత ఆ వంశాభివృద్ధి చేయాల్సిన భాద్యత కోడలి పై ఉంటుంది. కాబట్టి సంతానం కలగాలంటూ పెళ్లికూతురు త్వరలోనే తల్లి కావాలని పెద్దలు వధువుకు ఈ ఆశీర్వాదాలను ఇస్తారు. ఇలా పెద్దల ఆశీర్వచనాలతో నవ దంపతులు సంతోషంగా సుఖ శాంతులతో పిల్లా పాపాలతో నిండు నూరేళ్ళు జీవిస్తారని హిందూ సనాతన ధర్మంలో నమ్మకం.