Siddharth : సైనా నెహ్వాల్‌కు క్షమాపణ చెప్పిన సిద్ధార్థ్.. బహిరంగ లేఖ విడుదల..
Siddharth : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల పంజాబ్ పర్యటనకు వెళ్లిన క్రమంలో అక్కడ భద్రతా విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రధానికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజానీకం సంగతి ఏంటనే రీతిలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారణి సైనా నెహ్వాల్ ట్వీట్ చేసింది. కాగా, సైనా నెహ్వాల్ ట్వీట్ ను తప్పుబడుతూ హీరో సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలోనే ఆమెను ఉద్దేశించి చేసిన ట్వీట్ అసభ్య పదజాలం ఉందని చాలా మంది మండి పడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సిద్ధార్థ్ సైనా నెహ్వాల్‌కు క్షమాపణ చెప్పాడు.
సైనాను ఉద్దేశించి సబ్టిల్ కాక్ చాంపియన్ ఆఫ్ వరల్డ్.. అంటూ సిద్ధార్థ్ చేసిన చేసిన వ్యాఖ్యలపై చాలా మంది స్పందంచారు. సిద్ధార్థ్ వ్యాఖ్యలను ఖండించారు. చిన్మయి, సైనా తండ్రి, సైనా నెహ్వాల్ భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్‌తో పాటు కస్తూరి శంకర్ తదితరులు నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే సిద్ధార్థ్ స్పందించాడు. తాను చేసిన ట్వీట్ ద్వారా ఎవరినీ అగౌరవ పరిచలేదని అన్నాడు. బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌కు క్షమాపణలు చెబుతూ సిద్ధార్ధ్ బహిరంగ లేఖ విడుదల చేశారు.

siddharth apologises to saina nehwal
Siddharth : తన ఉద్దేశం అది కాదని పేర్కొన్న
తాను ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ ఒక జోక్ మాత్రమేనని వివరణ ఇచ్చాడు. తాను చేసిన కామెంట్ చాలా మందిని బాధించిందని, తనకు మహిళలను కించపరిచే ఉద్దేశం లేదని తెలిపాడు. సైనా నెహ్వాల్ ఎప్పుడూ ఒక గొప్ప క్రీడాకారిణి అని, తాను ఆమెను గౌరవిస్తానని స్పష్టం చేశాడు. తాను చేసిన కామెంట్స్‌పై క్షమాపణ కోరుతున్నానని సిద్ధార్థ్ పేర్కొన్నాడు. అలా మొత్తంగా సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వివాదానికి పులిస్టాప్ పడినట్లయిందని చెప్పొచ్చు. సిద్ధార్థ్ చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులను ఇటీవల ‘మహా సముద్రం’ సినిమాతో పలకరించాడు. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ, అనుకున్న స్థాయిలో ఆడలేదు.
Dear @NSaina pic.twitter.com/plkqxVKVxY
— Siddharth (@Actor_Siddharth) January 11, 2022