Siddharth Vs Allu Arjun : నా సినిమాని థియేటర్స్ నుండి ఎవరు బయటకు తీయలేరు.. సిద్ధార్థ్ సెన్సేషనల్ కామెంట్స్
ప్రధానాంశాలు:
Siddharth Vs Allu Arjun : నా సినిమాని థియేటర్స్ నుండి ఎవరు బయటకు తీయలేరు.. సిద్ధార్థ్ సెన్సేషనల్ కామెంట్స్
Siddharth Vs Allu Arjun : డిసెంబర్ 5న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మూవీకి పోటీగా మరో సినిమాని విడుదల చేసేందుకు ఎవరు ఆసక్తి చూపడం లేదు. అయితే సిద్ధార్థ్ మిస్ యూ అంటూ నవంబర్ 29న ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సిద్దార్థ్ చిన్నా అంటూ చివరగా నిర్మాత, నటుడిగా అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మిస్ యూ మూవీతో మరోసారి కొత్త లవ్ స్టోరీని టచ్ చేస్తున్నామని, ఇది కూడా హిట్ అయితే మళ్లీ న్యూ ట్రెండ్‌ను క్రియేట్ చేసినట్టు అవుతుందని సిద్దార్థ్ అన్నాడు.
Siddharth Vs Allu Arjun పుష్ప2 వస్తే ఏంటి ?
ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ కూడా మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా మీద టీమ్ అంతా కూడా మంచి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా 29వ తారీఖున రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఆ తరువాత వారం రోజుల్లో పుష్ప సినిమా కూడా రిలీజ్ కి సిద్ధమవుతుంది. దీని గురించి సిద్ధార్థ మాట్లాడుతూ నా సినిమా బాగుంటే థియేటర్ నుంచి ఎవరూ దాన్ని తీయలేరు. ఒకప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి సినిమాలు గురించి తెలిసేది కాదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది ఒక బాగున్న సినిమాని థియేటర్ నుంచి ఎవరు తీయలేరు. నా దృష్టిలో సినిమా అంతా ఒకటే, కొంతమంది బడ్జెట్ ను బట్టి దానిని పెద్ద సినిమా దీనిని చిన్న సినిమా అని నిర్ణయిస్తారు అంటూ తనదైన శైలిలో ఆన్సర్ చేశాడు సిద్ధార్థ్.
ఇక తన జీవితంలోకి తన దేవత వచ్చిందని, అసలే ఇప్పుడున్న టైంలో ఓ మంచి జరిగితే.. ఓ మంచి జరిగిందా? హమ్మయ్యా అని రిలాక్స్ అయ్యే స్థితిలో ఉన్నాం.. మనం ఒకటి ప్లాన్ చేస్తే.. దేవుడు ఇంకోటి ప్లాన్ చేస్తున్నాడు.. అని సిద్దార్థ్ చెప్పుకొచ్చాడు. తాను తెలంగాణ అల్లుడ్ని అయిపోయానని, అదితీ తన దేవత అని సిద్దు అన్నాడు. ఈ మిస్ యూ సినిమా కథ చాలా నచ్చిందని, కొత్తగా ఉండబోతోందని అన్నాడు.పేరుకు తమిళ్ హీరో అయినా కూడా తెలుగులోనే మంచి గుర్తింపు సాధించుకున్నాడు సిద్ధార్థ్. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సిద్ధార్థ ఆ తర్వాత శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఆ సినిమా తర్వాత తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా మంచి పేరును సిద్ధార్థ కు తీసుకొచ్చింది