Side Effects | వర్షాకాలంలో పాదాలకు ఫంగస్ ముప్పు..ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిందే!
Side Effects | వర్షపు నీరు మరియు బురద మన పాదాలకు సంబంధించిన సమస్యలను పెంచే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షం వల్ల రోడ్లు బురదమయం కావడం, దాంతో పాదాలకు మట్టి, నీరు అంటడం వల్ల గోర్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ సమయంలో పాదాలను నిర్లక్ష్యం చేయడం వల్ల గోర్లు కుళ్లిపోయే స్థితికి చేరే ప్రమాదం ఉంది.
ఇవి పాటించకపోతే ఫంగస్ తప్పదు!
* బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే పాదాలను శుభ్రం చేయాలి.
* గోళ్లలో మురికి పేరుకుంటే వెంటనే తొలగించాలి.
* సబ్బుతో కడగడం ద్వారా ఫంగస్‌ను నివారించవచ్చు.
– పాదాల సంరక్షణకు ఇంటిలోనే చేసుకోవచ్చే సులభమైన చిట్కాలు:
1. బేకింగ్ సోడా తో నానబెట్టడం:
గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా కలిపి పాదాలను 10 నిమిషాల పాటు నానబెట్టండి. తర్వాత లూఫాతో రుద్ది శుభ్రం చేయండి. ఇది దుర్వాసన, మురికి తొలగింపు , ఫంగస్ నివారణలో సహాయపడుతుంది.
2. హిమాలయన్ పింక్ సాల్ట్ + కొబ్బరి నూనె స్క్రబ్
ఈ మిశ్రమం పాదాలపై స్క్రబ్ చేయండి. ఇది చర్మాన్ని శుభ్రంగా ఉంచి, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.
3. వెనిగర్‌తో పాదాల శుద్ధి:
బకెట్‌లో నీటిలో ఒక కప్పు వెనిగర్ కలిపి, 15 నిమిషాల పాటు పాదాలను నానబెట్టండి. వారంలో 2-3 సార్లు ఇలా చేయడం వల్ల ఫంగస్ రాకుండా ఉండటంతో పాటు, పాద చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. తరువాత టవల్‌తో తడి తుడిచి, ఫుట్ క్రీమ్ రాసుకోవాలి.