Heart Stroke | నిద్రలో గుండెపోటు ప్రమాదం.. యువతలో పెరుగుతున్న హార్ట్ అటాక్ కేసులు
Heart Stroke | ఇటీవలి కాలంలో యువకుల నుంచి పెద్దల వరకు గుండెపోటుతో మృతిచెందుతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. ఇది అత్యంత ఆందోళన కలిగించే విషయం. గతంలో వృద్ధుల సమస్యగా భావించిన హార్ట్ అటాక్, ఇప్పుడు 30-40 ఏళ్ల లోపువారిని కూడా బలితీస్తోంది. ముఖ్యంగా రాత్రిపూట నిద్రలో గుండెపోటు రావడం మరింత కలవరానికి గురి చేస్తోంది.
#image_title
అర్థరాత్రి తర్వాతే ఎక్కువ ప్రమాదం
పరిశోధనల ప్రకారం, ప్రతి ఐదు గుండెపోట్లలో ఒకటి అర్థరాత్రి 12 నుండి ఉదయం 6 గంటల మధ్య సంభవిస్తోంది. నిద్రలో ఉన్నప్పుడు హార్ట్ అటాక్ లక్షణాలు గుర్తించలేకపోవడం వల్ల, సమయానికి వైద్య సహాయం అందక ప్రాణాపాయంకు దారితీస్తోంది.
నిద్రలో గుండెపోటుకు గల కారణాలు:
శరీర గడియార (సిర్కాడియన్ రిథం) ప్రభావం వల్ల రాత్రిపూట బీపీ లోగా ఉంటుంది
ఒత్తిడి, స్లీప్ అప్నియా, హార్మోన్ల మార్పులు
తెలియని గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు
నిద్ర లోపం & జీవనశైలి లోపాలు
నిద్రలో గుండెపోటు వచ్చే ముఖ్య సంకేతాలు:
ఛాతీలో బరువు లేదా నొప్పి
నిద్రలో ఎవరో గట్టిగా పిడికిలి పెట్టినట్టు ఛాతీలో నొప్పి అనిపించవచ్చు.
ఊపిరాడకపోవడం
అకస్మాత్తుగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.
చల్లని చెమటలు
గట్టిగా శ్రమించకపోయినా, అకస్మాత్తుగా జిగటగా చెమటలు పట్టడం.
వికారం, తలనొప్పి
వాంతులు వచ్చేలా అనిపించడం, మూర్చపోవడం, తల తిరగడం.
గుండె దడ
విశ్రాంతి సమయంలో కూడా గుండె వేగంగా కొట్టుకోవడం, లేదా తలకిందులేలా అనిపించడం.
ఎవరికి ఎక్కువ ప్రమాదం?
అధిక రక్తపోటు ఉన్నవారు
మధుమేహం బాధితులు
అధిక బరువు కలిగినవారు
ధూమపానం, మద్యం తీసుకునేవారు
స్లీప్ అప్నియా సమస్య ఉన్నవారు
తగినంత నిద్ర లేని వారు
ఆహారంలో అధిక కొవ్వులు తీసుకునే వారు