Singareni Job : నిరుద్యోగులకు శుభవార్త .. సింగరేణిలో భారీగా ఉద్యోగాల భర్తీ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Singareni Job : నిరుద్యోగులకు శుభవార్త .. సింగరేణిలో భారీగా ఉద్యోగాల భర్తీ ..!

 Authored By aruna | The Telugu News | Updated on :22 February 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Singareni Job : నిరుద్యోగులకు శుభవార్త .. సింగరేణిలో భారీగా ఉద్యోగాల భర్తీ ..!

Singareni Job : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించిన ప్రభుత్వం వరుసగా జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. సింగరేణిలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సింగరేణి సీఎండీ బలరాం నాయక్ వెల్లడించారు. ఇటీవల తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సింగరేణి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సంస్థ సీఎండీతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లను రెడీ చేయాలని భట్టి విక్రమార్క సీఎండి బలరాం నాయక్ ను ఆదేశించారు.

ఈ క్రమంలోనూ సింగరేణి కాలరీస్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ 168 ఇంటర్నల్ పోస్టులకు గురువారం నోటిఫికేషన్ వెలవడున్నట్లు తెలుస్తోంది. మొత్తం 485 ఉద్యోగాలకు దరఖాస్తులను సింగరేణి ఆహ్వానించనుంది. ఈ రిక్రూట్మెంట్ తో పాటు సంస్థలు కారుణ్య నియామకాలను చేపట్టాలని ఈ సంవత్సరంలో 1000 వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని భట్టి విక్రమార్క అన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచాలని భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. ఇక సింగరేణి సంస్థ అభివృద్ధిలో భాగమైన కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇటీవల సింగరేణి సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో కార్మికులకు ఉచిత ప్రమాద బీమా కల్పించడంపై అవగాహనపై ఒప్పంద కుదుర్చుకుంది.

దీంతో కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా అందించనున్నారు. దీంతో వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించినట్లు అవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అదేవిధంగా సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్మించిన 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను ఈనెల 26వ తేదీన ఆవిష్కరణకు ఏర్పాటు చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి అధికారులను ఆదేశించారు. ఇక సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ప్రకటించనున్నారు ఈ క్రమంలోనే సింగరేణి నుంచి భారీగా ఉద్యోగాలు భర్తీ చేయడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది