ఇంట్లో తల్లిదండ్రులు లేరని ప్రియుడిని ఇంటికి పిలిచిన యువతి .. ఆ సీన్ తన చెల్లెళ్లు చూశారని ఏం చేసిందో చూస్తే ..??

Authored By aruna | The Telugu News | Published on: October 11, 2023, 9:00 pm

తల్లిదండ్రులు లేకపోవడంతో తన ప్రియుడిని ఇంటికి పిలిచిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి అసభ్యకర భంగిమలో ఉండడం తన చెల్లెళ్లు చూశారు. ఈ విషయాన్ని తన చెల్లెళ్లు ఎక్కడ తల్లిదండ్రులకు చెబుతారో అని ప్రియుడితో కలిసి చెల్లెళ్లను హతమార్చింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు తన చెల్లెళ్లను ఎవరో చంపేశారు అని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ చివరకు పోలీసులకు చిక్కింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. బల్వాయి స్టేషన్ పరిధిలోని జోలాపూర్ అనే గ్రామానికి చెందిన అంజలి అనే యువతి స్థానికంగా ఉండే ఓ యువకుడిని ప్రేమిస్తుంది. ఇటీవల తన తల్లిదండ్రులు బయటికి వెళ్లిపోవడంతో ప్రియుడిని నేరుగా ఇంటికి పిలిపించుకుంది.

అతడితో సన్నిహితంగా ఉండగా 6, 4 సంవత్సరాల వయసున్న చెల్లెళ్లు చూశారు. దీంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పేస్తారు అనే భయంతో ఇద్దరినీ పదునైన ఆయుధంతో హత్య చేసింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు చెల్లెళ్లను ఎవరో చంపేశారు అని నమ్మించే ప్రయత్నం చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో అంజలి దుస్తులపై రక్తపు మరకలు ఉండడంతో పోలీసులు గుర్తించి ఆమెను ప్రశ్నించగా అసలు విషయాన్ని వెల్లడించింది. ఆమెకు సహకరించిన ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంజలిని అరెస్టు చేసి జైలుకు పంపారు.

Sister killed her younger sisters for boyfriend

Sister killed her younger sisters for boyfriend

తన ప్రియుడితో సుఖం కోసం ఏకంగా తన తోబుట్టువులను హతమార్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇంతటి దారుణానికి వడిగట్టిన అంజలికి జీవిత ఖైదీ శిక్ష వేసిన సరిపోదు అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వాళ్లను ఏం చేసినా తప్పు లేదు అని సీరియస్ గా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొంతమంది తమ స్వార్థం, సుఖం కోసం ఇలాంటి పనులు చేస్తూ సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నారు.

aruna

No bio available for this author.

Tags :
    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
    WhatsApp