Snake Bite : వామ్మో.. స్కూల్ లోనే క్లాస్ రూమ్ లో విద్యార్థిపై పాము దాడి.. మరో విద్యార్థిపై తేలు దాడి.. అందరూ షాక్
Snake Bite : స్కూల్ లోనే విద్యార్థులకు రక్షణ లేకపోతే ఇక తల్లిదండ్రులు పిల్లలను ఎలా స్కూల్ కు పంపిస్తారు చెప్పండి. స్కూల్ లో పిల్లలకు రక్షణ లేదని తెలిస్తే.. ఎవ్వరూ స్కూల్ కు కూడా వెళ్లరు. కానీ.. క్లాస్ రూమ్ లో విద్యార్థులకు ఇలాంటి ఘటనలు జరుగుతాయని.. ఎవ్వరూ ఊహించి ఉండరు. అటువంటి సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని శింగనమల మండలంలో ఉన్న సలకం చెరువు ప్రభుత్వ పాఠశాలలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.గౌతం అనే ఓ విద్యార్థి.. రోజూలాగే.. స్కూల్ కు వెళ్లాడు. క్లాస్ రూమ్ లోకి వెళ్లేముందు..
రూమ్ బయట చెప్పులు విప్పి క్లాస్ లోకి వెళ్లాడు. క్లాస్ రూమ్ నుంచి కొద్ద సేపటికి బయటికి వచ్చి తన చెప్పులు వేసుకోబోయాడడు. అంతే.. చెప్పుల పక్కనే ఉన్న పాము అతడిని కాటు వేసింది. దీంతో విద్యార్థి వెంటనే కింద పడిపోయాడు. ఆ విద్యార్థిని పాము కాటు వేసిన విషయాన్ని గుర్తించిన టీచర్లు.. స్థానికులు.. ఆ పామును వెతికి మరీ చంపేశారు.వెంటనే విద్యార్థికి యాంటీ డోస్ ఇచ్చారు వైద్యులు.కట్ చేస్తే అదే స్కూల్ లో ఓ విద్యార్థి బ్యాగ్ లోకి తేలు దూరింది.
Snake Bite స్కూల్ లోకి పాములు రావడానికి కారణం ఏంటి?
వెంటనే గమనించిన ఆ విద్యార్థి పుస్తకాల బ్యాగును కింద పడేశాడు. దీంతో ఆ బ్యాగులో నుంచి తేలు బయటికి వెళ్లిపోయింది.ఆ స్కూల్ లోకి పాములు, తేళ్లు రావడం సహజం అట. ఎందుకంటే.. ఆ స్కూల్ అడవిలో కొండ ప్రాంతంలో ఉంటుంది. అక్కడ చుట్టు పక్కన కూడా పిచ్చి మొక్కలు పెరిగిపోవడం వల్ల.. పాములు, తేళ్లు వస్తుంటాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్కూల్ చుట్టు పక్కన పరిసరాలు శుభ్రం చేయాలంటూ కోరుతున్నారు.