Snake : ఇదేం దారుణం.. కర్రీ ప‌ఫ్‌లో పాము పిల్ల క‌నిపించే స‌రికి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Snake : ఇదేం దారుణం.. కర్రీ ప‌ఫ్‌లో పాము పిల్ల క‌నిపించే స‌రికి..!

 Authored By ramu | The Telugu News | Updated on :13 August 2025,8:22 pm

Snake  : మహబూబ్‌నగర్‌లో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. కర్రీపఫ్‌ తినేందుకు బెకరీకి వెళ్లిన ఒక మహిళ తను తింటున్న కర్రీపఫ్‌లో పాము పిల్ల‌ కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఒక మహిళ జడ్చర్ల లోని ఒక బేకరీకి వచ్చింది. అక్కడ ఒక కర్రీ పఫ్‌ను ఆర్డర్‌ చేసింది. వెంటనే వెయిటర్‌ ఆమెకు కర్రీపఫ్‌ను తెచ్చి ఇచ్చాడు. వేయిటర్‌ దగ్గర నుంచి కర్రీ పఫ్‌ను తీసుకున్న సదురు మహిళ తినడం స్టార్ట్‌ చేసింది.

Snake ఇదేం దారుణం కర్రీ ప‌ఫ్‌లో పాము పిల్ల క‌నిపించే స‌రికి

Snake : ఇదేం దారుణం.. కర్రీ ప‌ఫ్‌లో పాము పిల్ల క‌నిపించే స‌రికి..!

Snake  : ఇదేం చోద్యం..

జడ్చర్ల పట్టణానికి చెందిన శ్రీశైలమ్మ మంగళవారం సాయంత్రం స్థానిక కొత్త బస్టాండ్‌ సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఉన్న బేకరీకి వెళ్లింది. అక్కడ కర్రీ, ఎగ్‌పఫ్‌లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లింది. అయితే ఆమెకు కర్రీపఫ్‌ రుచిలో ఏదో తేడాగా అనిపించడంతో వెంటనే దాన్ని ఓపెన్‌ చేసి చూసింది. అందులో కనిపించిన పామును చూసి ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే బెకరీ నిర్వాహకులను నిలదీస్తూ వారిపై ఫైర్ అయింది. ఆ తర్వాత స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఘటనపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ప‌ఫ్‌లో పురుగులు, బొద్దింక‌లు క‌నిపిస్తేనే మ‌న‌కు ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది. అలాంటిది పాము పిల్ల‌ని గుర్తించడంతో భయాందోళనకు గురైంది. వెంటనే స్థానికుల సాయంతో బాధితురాలు బేకరికి వెళ్లి యజమానిని ప్రశ్నించింది. అతను సరైన సమాధానం ఇవ్వకుండానే షాపు మూసేసి అక్కడి నుంచి జారుకున్నాడు. వెంటనే ఆమె పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసు విష‌యాన్ని పోలీసుల ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది