Chandrababu : మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు అధికారం లో ఉన్న సమయం లో రైతులను పట్టించుకోలేదని, అలాగే పలు రంగాలను నిర్వీర్యం చేసేలా నిర్ణయాలు తీసుకున్నాడు అంటూ ఆరోపించారు. గుంటూరు జిల్లా ఇంకా పలు జిల్లాల్లో రైతులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు అంటూ ఆయన తెలియజేశారు.
గుంటూరు జిల్లాలో జరిగిన రైతు సభలో బిజెపి నాయకులు పాల్గొన్నారు. మిర్చి పంట వేసిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం కు విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసింది. సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆర్థికపరమైన అన్యాయాలను చేశారు. ఆయన ఉద్యోగాలను అమ్ముకోవడం మాత్రమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరిగింది.
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తే ఆ సబ్ స్టేషన్ లో ఉన్న ఉద్యోగాలను చంద్రబాబు నాయుడు అమ్ముకున్నాడు అంటూ సోము వీర్రాజు ఆరోపించాడు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని, కానీ ఈసారి ఏపీలో అధికారంలోకి వచ్చేది బీజేపీ అని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తుందని కచ్చితంగా తెలుగు దేశం పార్టీకి మరోసారి చుక్కెదురు తప్పదంటూ ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.