Home » Exclusive » Sonu Sood Became Milkman Vido Viral
Exclusive

Sonu Sood : మిల్క్ మ్యాన్ సోనూసూద్.. బర్రెలకు గడ్డి తీసుకెళ్తూ.. సైకిల్ తొక్కి.. వైరల్ వీడియో

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: July 25, 2021, 12:25 pm
Advertisement

Sonu Sood : సోనూ సూద్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. సినిమాల్లో విలన్ గా నటిస్తూ అందరినీ అలరించిన సోనూ సూద్ లో ఉన్న మానవత్వం.. కరోనా మొదటి వేవ్ సమయంలో బయటపడింది. లాక్ డౌన్ పెట్టి కేంద్రం చేతులు దులిపేసుకుంటే.. వలస కూలీలు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లే ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్లను తమ స్వస్థలాలకు పంపే బాధ్యతను తీసుకున్న సోనూ సూద్.. వలస కూలీలను, వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్లకు తమ స్వస్థలాలకు పంపించారు. అప్పటి నుంచి సోనూ సూద్.. కష్టాల్లో ఉన్నవాళ్ల పాలిట దేవుడయ్యారు.

Advertisement

sonu sood became milkman vido viral

అప్పటి నుంచి తనకు తోచిన సాయం చేస్తూనే ఉన్నారు సోనూ సూద్. ఇప్పటి వరకు ఆయన నుంచి సాయం పొందిన వాళ్లు కోకొల్లలు. సోనూ సూద్.. ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయారు. ఆయన ఇంటి ముందు రోజూ వందల మంది కష్టాల్లో ఉన్నవాళ్లు క్యూ కడతారు. ఓ టీమ్ ను ఏర్పాటు చేసి.. దేశంలోని ఏ మూల అయినా సరే.. సాయం అడిగిన వాళ్లకు సాయం అందిస్తూ గ్రేట్ అనిపించుకుంటున్నారు.

Advertisement

sonu sood became milkman vido viral

Sonu Sood : మిల్క్ మ్యాన్ గా మారి.. సోనూసూద్ ఏం చేశారంటే?

సోనూసూద్ కు వ్యవసాయం అంటే కూడా చాలా ఇష్టం. ఆయనకు వ్యవసాయ భూమి కూడా ఉంది. అక్కడికి వెళ్లి సమయం దొరికినప్పుడు వ్యవసాయం చేస్తుంటారు. తాజాగా తనవద్ద ఉన్న బర్రెల కోసం గడ్డిని కోసి.. వాటికి మేత వేయడానికి ఓ సైకిల్ పై తన పని వ్యక్తితో కలసి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి.. ఆయనతో కాసేపు ముచ్చటించారు సోనూ సూద్. ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా సైకిల్ తొక్కుతూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బర్రెల పాలు కూడా పితికారు సోనూసూద్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి ==>  జులై 26, సోమవారం ఎపిసోడ్ హైలైట్స్.. విషం కలిపిన నీళ్లను తాగిన దీప..!

ఇది కూడా చ‌ద‌వండి ==> పవన్ కళ్యణ్ బాలు మూవీలో చిన్నారి ఇప్పుడు ముంబై మోడల్స్‌నే మించిపోయింది చూశారా

ఇది కూడా చ‌ద‌వండి ==> కార్తీక్‌, దీప ఎప్పుడు క‌లుసుకుంటారో క్లారిటీ ఇచ్చిన కార్తీక‌దీపం డైరెక్టర్..!

 ఇది కూడా చ‌ద‌వండి ==> పెళ్లిపై షాకింగ్ కామెంట్స్‌.. విప్పేస్తా, లాగేస్తా.. రెచ్చిపోయిన యాంకర్ రష్మి.. వీడియో

Advertisement

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి