సోనూసూద్ నువ్వు తోపు.. హాలీవుడ్ స్టార్స్ కూడా నీ ముందు దిగదుడుపే?
అవును.. సోనూసూద్ ముందు ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ కూడా తేలిపోతున్నారు. ఇండియాలో అయితే.. ఇంత రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న నటుడెవ్వరూ లేరు. ఒక్క సోనూసూద్ తప్ప. తను సినిమాల్లో విలన్ కానీ.. రియల్ లైఫ్ లో హీరో. లాక్ డౌన్ సమయం నుంచి ఇప్పటి వరకు తనకు తోచిన సాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు సోనూసూద్. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి సాయం చేసి కాదు.. ఓ సర్వేలో నెంబర్ వన్ […]
అవును.. సోనూసూద్ ముందు ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ కూడా తేలిపోతున్నారు. ఇండియాలో అయితే.. ఇంత రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న నటుడెవ్వరూ లేరు. ఒక్క సోనూసూద్ తప్ప. తను సినిమాల్లో విలన్ కానీ.. రియల్ లైఫ్ లో హీరో. లాక్ డౌన్ సమయం నుంచి ఇప్పటి వరకు తనకు తోచిన సాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు సోనూసూద్.
తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి సాయం చేసి కాదు.. ఓ సర్వేలో నెంబర్ వన్ గా నిలిచి వార్తల్లోకెక్కారు.
యూకేకు చెందిన ఈస్టర్న్ ఐ అనే ఓ మ్యాగజైన్ సర్వే నిర్వహించింది. టాప్ 50 ఏషియన్ సెలబ్రిటీస్ గ్లోబల్ 2020 అనే సర్వేలో భాగంగా.. సోనూసూద్ టాప్ లో నిలిచారు.
మొత్తం ఏషియాలోనే సోనూసూద్ కు నెంబర్ వన్ పొజిషన్ దక్కింది. టాప్ 50 లో సోనూసూద్ టాప్ ప్లేస్ లో దక్కించుకోవడానికి కరోనా సమయంలో ఆయన చేసిన సాయమేనని మ్యాగజైన్ పేర్కొంది.
తనకు మొదటి ప్లేస్ రావడంపై స్పందించిన సోను… నేను చేసే సాయాన్ని గుర్తించిన ఈస్టర్న్ ఐ మ్యాగజైన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ వెల్లడించారు. దేశ ప్రజలకు సాయం చేయడం నా బాధ్యత. నావంతు బాధ్యతను నేను నిర్వర్తించాను.. ఇంకా నిర్వర్తిస్తూనే ఉంటాను… అంటూ సోనూ ఈసందర్భంగా తెలిపారు.