Mutton Curry : మాసాలాలు ఎక్కువగా వాడకుండ సూపర్ టేస్టిగా మటన్ కర్రీ ఎలా తయారు చెయ్యలో చూద్దాం…
Mutton Curry : మనం సాధారణంగా చికెన్,మటన్ ఫిష్లను బాగా ఇష్ట పడుతుంటాము . చేపలు అందరు ఇష్టపడరు . దానిలో ముళ్ళు ఉంటాయని అందరికి తినడం రాదు . అలాగే చికెన్ కూడా వేడి చేస్తుంది అని దానిని కూడా సరిగా తినటానికి ఇష్ట పడరు . అదే మటన్ అయితే చాల ఎక్కువగా ఇష్టపడుతుంటారు .. మనకి ఇష్టమైన మటన్ ఈజీగా మాసాలు ఎక్కువగా వాడకుండా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్దాలు : 1కేజీ మటన్, ఆయిల్ , 2బిర్యానీ ఆకులు, 4యాలకులు, 4లవంగాలు, 1 దాల్చినచెక్క ,పచ్చిమిర్చి ,వెలుల్లి ,ఉల్లిపాయలు ,అల్లంవెలుల్లి పేస్ట్ ,కారం , ఉప్పు ,ధనియా పౌడర్ ,జీలకర కొద్దిగా ,కొత్తిమీర ,పసుపు వాటర్ …. తయారీ విధానం…..: స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తరువాత 2 బిర్యానీ ఆకులను ,4యాలకలు 4లవంగాలు 1దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ షాజీరా ఇలా ఒక దాని తరవాత ఒకటి వెయ్యాలి.

Spicy Mutton Curry in Telugu
ఇవి కొంచం వేగిన తరువాత ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై అయినా తరువాత కొంచం పసుపు వేసుకొని తరువాత శుభ్రంగా కడిగిన మటన్ వేసుకొని దానిని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత దానిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తరువాత 3స్పూన్ల కారం వేసుకోవాలి కొద్దీ సేపు మూత పెట్టి ఉంచాలి తరువాత మూత తీసి ధనియా పౌడర్ ,కొంచం జీలకర్ర పౌడర్ వెయ్యాలి. తరువాత 2గ్లాసుల వాటర్ వేసుకొని 20 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. సూప్ దగ్గరగా అయినా తరువాత కొత్తిమీర వేసుకొని దించుకోవాలి . అంతే మసాలాలు ఎక్కువగా వాడకుండా మటన్ కర్రీ రెడీ .
