Mutton Curry : నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ ఎలా చెయ్యాలో తెలుసా…!
Mutton Curry : మటన్ కర్రీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ఈ మటన్ కర్రీని ఎన్నో రకాలుగా తయారు చేసుకుంటారు. అయితే మటన్ వేపుడు ఎంతో రుచిగా కూడా ఉంటుంది. అయితే ఫంక్షన్స్ లో మటన్ కర్రీ పెడితే ఎన్నో గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ మటన్ ను అందరూ తినలేరు. దీని ఖరీదు కూడా చాలా ఎక్కువే. ఇప్పటికే మటన్ లవర్స్ ఎన్నో రకాల వంటకాలను ట్రై చేసి ఉంటారు. ఈసారికి బ్లాక్ […]
ప్రధానాంశాలు:
Mutton Curry : నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ ఎలా చెయ్యాలో తెలుసా...!
Mutton Curry : మటన్ కర్రీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ఈ మటన్ కర్రీని ఎన్నో రకాలుగా తయారు చేసుకుంటారు. అయితే మటన్ వేపుడు ఎంతో రుచిగా కూడా ఉంటుంది. అయితే ఫంక్షన్స్ లో మటన్ కర్రీ పెడితే ఎన్నో గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ మటన్ ను అందరూ తినలేరు. దీని ఖరీదు కూడా చాలా ఎక్కువే. ఇప్పటికే మటన్ లవర్స్ ఎన్నో రకాల వంటకాలను ట్రై చేసి ఉంటారు. ఈసారికి బ్లాక్ మటన్ మసాలా కర్రీ ని వండండి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ కర్రీ చపాతి, పులావ్, రోటి దీనిలోకైనా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ కర్రీకి మసాలాలు బాగా పట్టించి వండుతారు. ఈ కర్రీ చేయటం కూడా చాలా ఈజీ. ఈ కర్రీ చేయటానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇంత రుచికరమైన ఈ బ్లాక్ మటన్ కర్రీని ఎలా తయారు చేస్తారు. దీనికి కావలసిన పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ కర్రీ కి కావలసిన పదార్థాలు : మటన్, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, పసుపు, కొబ్బరి పొడి, అల్లం,వెల్లుల్లి పేస్ట్, సోంపు, ధనియాలు, లవంగాలు, జిలకర్ర, గసగసాలు, యాలకులు, దాల్చిన చెక్క,ఎండుమిర్చి, మిరియాలు, బిర్యానీ ఆకు, కసూరి మైతి, వెల్లుల్లి, బంగాళదుంపలు, చింతపండు రసం, పెరుగు, పుదీనా, ఆయిల్
కర్రీ తయారీ విధానం : ముందుగా మటన్ ను మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత మటన్ ను క్లీన్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, కారం,ఉప్పు, పెరుగు వేసుకొని బాగా కలిపి ఒక అరగంట సేపు నానబెట్టాలి. ఇది మ్యారినేట్ అయిన తర్వాత ఒక కుక్కర్ ను తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలు, మటన్,నీళ్లు పోసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ వేడి చల్లారే లోపు ఒక కళాయి తీసుకొని దానిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, అల్లం,గసగసాలు, దాల్చిన చెక్క, మిరియాలు, వెల్లుల్లి వేసుకొని వేయించాలి. తరువాత వాటిని చల్లారనివ్వాలి.
ఈ మిశ్రమం మొత్తం కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్టులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. ఆ తర్వాత దానిలో వెల్లుల్లి,అల్లం తరుగు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త రంగు మారిన తర్వాత దానిలో ఆలుగడ్డ ముక్కలు వేసి కలపాలి. ఇవి కూడా వేగిన తర్వాత దానిలో మటన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మటన్ ఒక రెండు మూడు నిమిషాలకు వేయించిన తర్వాత మిక్సీ లో పట్టిన పేస్ట్ ను మరియు చింతపండు రసాన్ని,నీళ్లు పోసుకుని బాగా ఉడకనివ్వాలి. మటన్ బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత దానిలో కొద్దిగా పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మటన్ కర్రీ రెడీ అయినట్లే. ఈ కర్రీ అనేది ఎంతో రుచిగా ఉంటుంది…