Sri Rama Navami : 5 లక్షల దీపాలతో శ్రీరాముడి చిత్రపటం.. అరుదైన రికార్డు
Sri Rama Navami: శ్రీరామ నవమి వేడుకలు ఏప్రిల్ 10న ఘనంగా జరగనున్నాయి. శ్రీరాముడు జన్మించిన ఈ పవిత్రమైన రోజున భక్తులు శ్రీరామంద్రుడిని నిష్టగా పూజిస్తే సకలపాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. శ్రీరాముడి జన్మదినం చైత్రశుద్ధ నవమిని శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. మన దేశంలో రామాలయం లేని గ్రామం అంటూ ఉండదు. ఈ రోజును హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకల అంగరంగా వైభవంగా సాగుతాయి. వీధులలో చలువ పందిళ్లు వేసి, సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా జరిపిస్తారు.
అయితే పద్నాలుగేళ్ల అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతీసమేతంగా అయోధ్యకు చేరుకోగా పట్టాభిషేకం జరిగింది. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకే చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంచనాలతో శ్రీరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణం జరిపిస్తారు. వేలాది మంది భక్తులు దర్శించుకుని పూజలు చేస్తారు.
Sri Rama Navami: 150 అడుగుల భారీ చిత్రపటం
ఇదిలా ఉంటే శ్రీరామ నవమిని పరస్కరించుకుని బీహార్ లోని భగల్ పూర్లో అరుదైన సుందర దృష్యం ఆవిషృతమైంది. 150 అడుగుల చిత్రపటాన్ని రూపొందించారు. భగల్ పూర్ లోని లజపత్ పార్కు మైదానంలో 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 లక్షల దీపాలతో శ్రీరాముడి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. దీనికి అయిదు రోజులుగా నిర్వాహకులు కష్టపడుతున్నారు. 12 రకాల రంగులతో 150 అడుగుల శ్రీరాముడి చిత్రపటాన్ని ఏర్పాటు చేశామని నిర్మాహకుడు చౌబే తెలిపారు. గిన్నీస్ బుక్ లో రికార్డు చేయడానికి ఆ జట్టు ఏప్రిల్ 6 నే ఇక్కడికి చేరుకుందని తెలిపారు. ఈ నెల 10న జరిగే ఉత్సవాలకు బీహార్ డిప్యూటీ సీఎం, సెంట్రల్ మినిస్టర్ హాజరుకానున్నట్లు తెలిపారు.