NTR District : ఈ క‌లెక్ట‌ర‌మ్మ చేసే ప‌నుల‌కి ఎవ‌రైన సెల్యూట్ కొట్ట‌డం ఖాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

NTR District : ఈ క‌లెక్ట‌ర‌మ్మ చేసే ప‌నుల‌కి ఎవ‌రైన సెల్యూట్ కొట్ట‌డం ఖాయం..!

 Authored By aruna | The Telugu News | Updated on :30 August 2024,3:00 pm

NTR District : ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో 2013 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి గుమ్మళ్ల సృజన కలెక్టర్‌గా నియ‌మించ‌బ‌డ్డారు. సృజన 2015లో కృష్ణాజిల్లా సబ్‌ కలెక్టర్‌గా చేశారు. ఆమె గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఆ సమయంలో కరోనా ప్రబలుతుండగా, ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చి, మెటర్నటీ సెలవు ఉపయోగించుకునే అవకాశం ఉన్నా, తన బిడ్డతో విధులకు హాజరుకావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. గుమ్మళ్ల సృజన తండ్రి బలరామయ్య ఐఏఎస్‌ అధికారి. తల్లి సుగుణశీల గృహిణి. భర్త రవితేజ హైకోర్టు అడ్వకేట్‌గా చేస్తున్నారు. సృజన విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లో జరిగింది. బీఏ సెయింటాన్స్‌లో, ఎంఏ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో చేశారు. శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. సృజన భర్త రవితేజ ప్రముఖ సోషలిస్టు నాయకుడు వాసిరెడ్డి కృష్ణారావు మనవడు.

NTR District : ఆమె రూటే స‌ప‌రేటు..

పక్కా తెలుగు కుటుంబానికి చెందిన కలెక్టర్ సృజన తన పనితీరుతో అందరి ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. పనులు విషయంలో అధికారులను పరుగులు పెట్టిస్తూ ఉంటారు. సృజన తండ్రి బలరామయ్య రిటైర్ట్ ఐఏఎస్‌. ఆమె భర్త రవితేజ హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టిస్ చేస్తున్నారు. సృజన హైదరాబాద్‌లో చదువుకున్నారు. బీఏ సెయింటాన్స్‌లో, ఎంఏ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు. శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. అయితే క‌లెక్ట‌ర‌మ్మ చేసిన ప‌నికి ప్ర‌తి ఒక్క‌రు హ్య‌ట్సాఫ్ అంటున్నారు.

సాధార‌ణంగా ఎవరైనా ఆఫీసు బయట చెప్పులు విడిచి లోపలికి రావలెను అని బోర్డు పెడతారు. కానీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీసు బయట మాత్రం పాదరక్షలు ధరించి లోనికి వెళ్లండి అని బోర్డులు పెట్టారు. ఈ బోర్డులు అక్కడికి వెళ్లినవారికి ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగించాయి. వివరాలు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ సృజన కావాలనే ఈ బోర్డులు ఏర్పాటు చేయించారు. కొద్ది రోజుల క్రితం తనను కలిసేందుకు వచ్చిన రైతులు.. చెప్పులు బయట విడిచి.. లోపలికి రావడాన్ని ఆమె గమనించారట. ఆఫీసు లోపల స్టాఫ్ అంతా పాదరక్షలు ధరించే తిరుగుతారు. కానీ అందరి ఆకలి తీర్చే రైతులు అలా రావడం ఆమెకు నచ్చలేదు. దీంతో తన క్యాబిన్లోకి ఎవరైనా చెప్పులతోనే రావచ్చని బోర్డు పెట్టించారు. ఇప్పుడు ఈ విష‌యం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది