Star Anise | స్టార్ సోంపు ఆరోగ్య రహస్యాలు.. తప్పక డైట్‌లో చేర్చుకోవడం మరిచిపోకండి
Star Anise | మీ వంటలలో వాసన కోసం వేసే సాధారణ మసాలా అయిన స్టార్ సోంపు (Star Anise) లో ఎంతో అధ్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చైనా మరియు భారతీయ సంప్రదాయ వైద్యాలలో ప్రాచీన కాలం నుండే ఇది ప్రాముఖ్యతను సంపాదించింది. ఇప్పుడు దీని శక్తివంతమైన పోషకాల వల్ల వైద్యపరంగా విశేషంగా ఉపయోగపడుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
#image_title
స్టార్ సోంపు లోని ఆరోగ్య రహస్యాలు ఇవే..!
ఇమ్యూనిటీ బలోపేతం
స్టార్ సోంపులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచి, వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి వ్యాధికారకాలు నుంచి రక్షణ కలిగిస్తాయి.
జీర్ణక్రియకు మేలు
ఇదే కాదు, స్టార్ సోంపు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అపానవాయువు, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు ఇది సహజమైన పరిష్కారంగా ఉపయోగపడుతుంది.
శ్వాసకోశ ఆరోగ్యం
దగ్గు, జలుబు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలకు స్టార్ సోంపు ఒక సాంప్రదాయ ఔషధంగా పని చేస్తుంది. దీనిలో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల ఇది సహజ చిట్కాగా ఉపయోగపడుతుంది