Star Anise : నరాల సమస్యతో బాధపడుతున్నారా… ఈ స్టార్ సోంపుతో సమస్యలన్నీ పరార్…!
ప్రధానాంశాలు:
Star Anise : నరాల సమస్యతో బాధపడుతున్నారా... ఈ స్టార్ సోంపుతో సమస్యలన్నీ పరార్...!
Star Anise : నక్షత్రపు ఆకారంలో ఉన్నటువంటి నక్షత్ర సోంపు అనేది మన భారతీయ వంటగదికి గర్వకారణం అని చెప్పొచ్చు. అయితే ఎన్నో వేల ఏళ్ళ గా ఆసియా ప్రజలు ఈ స్టార్ సోంపును సహజ శక్తిని సాదనంగా, జీర్ణాశయంత్ర సమస్యలకు నివారిణిగా వాడుతున్నారు. ఈ అద్భుతమైన మసాలా ఏ వంటనైనా సరే ఎంతో రుచిగా మారుస్తుంది. దీనిలో విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉన్నాయి. దీనివలన రోగనిరోధక శక్తిని బలంగా చేస్తుంది. అలాగే ఎన్నో సమస్యల నుండి కూడా రక్షిస్తుంది. అంతేకాక నరాలకు సంబంధించిన సమస్యలను నియంత్రించడంలో కూడా ఈ స్టార్ సోంపు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ స్టార్ సోంపు ఎంతో బలహీనమైన నరాల సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు సిరల్లో మంట ను కూడా నియంత్రిస్తాయి. ఇది నరాల అనుబంధాన్ని కూడా ఎంతో ప్రోత్సహిస్తుంది…
మీరు నరాల సమస్యల నుండి బయట పడాలి అనుకుంటే, ఈ స్టార్ సోంపు వాటర్ తీసుకుంటే చాలు. దీనిని వాడటానికి ఒక గ్లాస్ నీటిలో ఒకటి లేక రెండు స్టార్ సోంపులను వేసుకోవాలి. వాటిని సుమారు పది నిమిషాల పాటు మరిగించాలి. దాని తర్వాత వాటిని వడగట్టుకొని దానిలో కొద్దిగా తేనె వేసుకొని తాగాలి. ఇది నరాల వాపు మరియు బలహీనత నుండి ఎంతో ఉపసమణాన్ని కలిగిస్తుంది. అయితే నరాల బలహీనత సమస్యలు బయటపడాలనుకుంటే ఈ స్టార్ సోంపు ను పొడి రూపంలో కూడా వాడవచ్చు. అయితే ఈ పొడిని తయారు చేసుకునేందుకు ముందుగా 50 గ్రాముల నుండి100 గ్రాముల వరకు స్టార్ సోంపులను తీసుకోవాలి. వీటిని కొద్దిగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పొడిని సలాడ్ మరియు పప్పులు,కూరగాయలు మొదలైన వాటిపై చల్లుకొని కూడా తీసుకోవచ్చు.
నరాల సమస్యల నుండి బయట పడేందుకు తేనెతో పాటుగా స్టార్ సోంపును కూడా వాడవచ్చు. దీనిని వాడటానికి ఒక చెంచా తేనెను తీసుకొని దానిలో స్టార్ సోంపు పొడి వేసి గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. ఇలా చేయటం వలన మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణశక్తిని కూడా ఎంతో బలంగా చేస్తుంది. అలాగే శరీర బరువును కూడా నియంత్రిస్తుంది. అంతేకాక ఈ స్టార్ సోంపుతో టీ చేసుకుని తాగటం వలన జలుబు మరియు ఫ్లూ, గొంతు నొప్పి ఇలా అన్ని సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. వీటిలో యాటి బ్యాక్టీరియా లక్షణాలతో పాటుగా స్టార్ సోంపులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరం నుండి సహజంగా విషాన్ని బయటకు పంపించే సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే రోగ నిరోధక వ్యవస్థకు ఎంతో మద్దతు కూడా ఇస్తుంది. ఇవి గొంతుకు సంక్రమించే సూక్ష్మ క్రిములను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అయితే చచ్చుబడిన నరాలకు ప్రాణం పోయటనికి ఈ స్టార్ సోపు వాడటం చాలా ఆరోగ్యకరమైనది. అయితే ఈ సమస్య ఎక్కువగా ఉన్నవారు మాత్రం కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి..