Star Anise : అనాస పువ్వు ఔషధ గుణాలు తెలిస్తే అస్సలు వదలరు.. దాని గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!
Star Anise : స్టార్ అనిసె దీన్నే మనం అనాస పువ్వు అంటాం. దీన్ని మనం ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తాం. దీన్ని మసాలా దినుసు అంటారు. మన వంటింట్లో అన్ని మసాలా దినుసులు ఉంటాయి. అయితే అనాస పువ్వు అనేది స్పెషల్ పువ్వు. అది చూడటానికి స్టార్ లా ఉంటుంది. దీన్ని మనం ఎక్కువగా బిర్యానీల్లో, భగారాలో వాడుతుంటాం. కానీ.. ఈ పువ్వును పెద్దగా పట్టించుకోం. కానీ.. అసలు పట్టించుకోవాల్సిందే దీన్ని. ఎందుకంటే.. ఇది మామూలు పువ్వు కాదు.. అది ఔషధాల గని.
ఈ పువ్వు గురించి ఇప్పుడు అసలు విషయాలు తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. ఎక్కువగా మసాలా కూరల్లో ఈ పువ్వును వాడుతుంటారు. పులావ్ లోనూ వేస్తారు. ఈ పువ్వులో విటమిన్ ఏ, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. అనాస పువ్వు జలుబు, దగ్గు లాంటి సమస్యలకు చెక్ పెడుతుంది.
Star Anise : జీర్ణాశయ సమస్యలను దూరం చేసే అనాస పువ్వు
చాలామందికి కడుపు ఉబ్బరం సమస్యలు, వికారం సమస్యలు వేధిస్తుంటాయి. దీని వల్ల.. జీర్ణాశయ సమస్యలు వస్తుంటాయి. అనాసపువ్వులో ఉండే థైమోల్, టెర్పినోల్ అనే పదార్థాలు.. జీర్ణాశయ సమస్యలను దూరం చేస్తాయి. అలాగే వికారం, కడుపు ఉబ్బరం సమస్యలను కూడా అవి దూరం చేస్తాయి. ఇది యాంటీ వైరల్ గుణాన్ని కలిగి ఉంటుంది. దాని వల్ల.. ఎటువంటి వైరస్ లు దరి చేరవు. బాక్టీరియా వల్ల వచ్చే అనేక రోగాలకు అనాస పువ్వు మంచి ఔషధం. మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నా.. మూత్రనాళాల ఇన్ఫెక్షన్ వచ్చినా అనాసపువ్వును తీసుకుంటే చాలు. ఫంగస్, ఫ్లూ లాంటి వాటికి చెక్ పెట్టాలన్నా అనాస పువ్వే బెస్ట్.
Star Anise : మహిళలకూ మంచి మెడిసిన్ అనాస పువ్వు
అనాస పువ్వు వల్ల మహిళలకు చాలా లాభం కలుగుతుంది. మహిళలకు నెలనెలా వచ్చే నెలసరి సమస్యలకు చెక్ పెట్టాలంటే అనాస పువ్వు మంచి మందు. చాలా మంది మహిళలకు నెలసరి సమయంలో తీవ్రంగా కడుపునొప్పికి గురవుతుంటారు. అటువంటి వాళ్లు అనాస పువ్వును తీసుకుంటే.. నెలసరి సరిగ్గా వస్తుంది. అలాగే.. కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. చాలామంది మహిళలు అండాశయం సమస్యలతో బాధపడుతుంటారు. అటువంటి వాళ్లు అనాస పువ్వును వాడితే మంచి ఫలితం ఉంటుంది. మహిళల్లో విడుదలయ్యే ఈస్ట్రోజోన్ హార్మోన్ ను కూడా అనాస పువ్వు కంట్రోల్ చేస్తుంది.
ఇది కూడా చదవండి ==> అందరం చూసిన మొక్కే.. దీనివల్ల ఎన్ని లాభాలో మనకు ఇప్పటిదాకా తెలియదు..?
ఇది కూడా చదవండి ==> ఉలవచారు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు అస్సలు వదలరు…!
ఇది కూడా చదవండి ==> షుగర్ ఎందుకు వస్తుందో తెలుసా? అసలు కారణం తెలిస్తే బిత్తరపోతారు..!
ఇది కూడా చదవండి ==> రాత్రి పూట దిండు కింద వెల్లుల్లి పెట్టుకొని నిద్రపోతే బాడీ లోపల ఏం జరుగుతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు?