Wheat | కేవలం 21 రోజులు గోధుమలు మానేస్తే అద్భుత ఫలితాలు .. డాక్టర్స్ చెబుతుంది ఏంటంటే..!
Wheat | నేటి ఫాస్ట్ ఫుడ్ యుగంలో మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. దాని ప్రభావం మన ఆరోగ్యంపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ సమస్యలకు ప్రధాన కారణాలలో ఒకటి గోధుమలు అని క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ తరంగ్ కృష్ణ ఇటీవల వెల్లడించారు.
#image_title
ఇది తగ్గించండి..
సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. గోధుమలతో చేసిన ఆహారాన్ని కేవలం 21 రోజులు మానేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు గురించి ఆయన వివరించారు.డాక్టర్ తరంగ్ కృష్ణ మాట్లాడుతూ..“ఇప్పటి గోధుమలు పూర్వం లాంటివి కావు. వాటిలో గ్లూటెన్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల చాలా మందిలో జీర్ణ సమస్యలు వస్తున్నాయి. కానీ మన పూర్వికుల కాలంలో గోధుమలు సహజమైన రూపంలో ఉండేవి. అవి పొట్టుతో తినేవారు కాబట్టి జీర్ణం సులభంగా అయ్యేది. అందువల్లే వారు 80-100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించగలిగారు” అని తెలిపారు.
ఇప్పుడు మార్కెట్లో లభించే గోధుమలు జన్యుపరంగా మార్పు చేయబడినవే (genetically modified) కావడంతో, వాటిలోని గ్లూటెన్ మన శరీరానికి జీర్ణం కావడం కష్టమవుతోందని ఆయన చెప్పారు.గోధుమల ఆహారం మానేస్తే జీర్ణవ్యవస్థకు ఉపశమనం లభిస్తుంది.కడుపు ఉబ్బరం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా కొవ్వు కాలేయం ఉన్నవారు గ్లూటెన్ తీసుకోవడం మానేయాలని సూచించారు.