personal finance : డిసెంబర్ 31లోగా ఈ నాలుగు పనులను తప్పక పూర్తి చేయాలి.. లేకపోతే ఇక అంతే సంగతులు..!
personal finance : 2021 ముగింపుకు మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. మన సేవింగ్స్ కు సంబంధించి ఈ లోపలే మనం కొన్ని ఫైనాన్సియల్ టాస్కులను పూర్తి చేయాల్సి ఉంది. లేక పోతే భారీ నష్టం చవిచూడక తప్పదు. అవును ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు నుంచి పెన్షన్ కోసం వార్షిక జీవన ప్రమాణ పత్రం సమర్పణ వరకు కొన్ని ఆర్థిక అంశాలతో ముడిపడిన టాస్కుల తుది గడువు డిసెంబర్ 31 వరకే ఉంది. వీటిని వచ్చే నాలుగు రోజుల్లో ఎలాగైనా తప్పక పూర్తి చేయాలి. దీనిలో ఏమాత్రం విఫలమైన మనం నష్టాల బాటలో పడినట్టే.
1. ప్రభుత్వ పదవీ విరమణ పొందిన వారి వార్షిక జీవిత ధృవీకరణ పత్రం లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించడానికిఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తుది గడువును డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించింది. ఇప్పటికే ఈ గడువును రెండుసార్లు పొడిగించింది. ఒకసారి జూలై 31 నుంచి సెప్టెంబర్ 30, 2021 వరకు, మరొకసారి డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్టు సీబీడీటీ పేర్కొంది.
2. ఆదాయపు పన్నుకు చెందిన కొత్త పోర్టల్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో రిటర్నుల దాఖలకు మరికొన్ని రోజులు సమయం ఇచ్చింది ఆ శాఖ. పన్ను చెల్లింపుదారులు తమ జరిమానాలను తప్పించుకునేందుకు తుది గడువు డిసెంబర్ 31 లోపల ఐటీఆర్‌లను దాఖలు చేయాల్సి ఉంటుంది. పెన్షనర్లు వ్యక్తిగతంగా శాఖలను సందర్శించడం ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రమాణపత్రాన్ని సమర్పించవచ్చు. ఆన్ లైన్ లో జీవన్ ప్రమాణ్ పోర్టల్ అడ్రస్ (https://jeevanpramaan.gov.in/)ను సందర్శించాలి.
3. ఎవరైతే పదవీ విరమణ పొందారో.. వారంతా డిసెంబర్ 31 వరకు తమ వార్షిక జీవన ప్రమాణ పత్రాన్ని తప్పక సమర్పించాల్సి ఉంటుంది. వీటిని గడువు లోపల సమర్పిస్తేనే, పెన్షన్‌ను కంటిన్యూగా పొందగలుగుతారు. లేదంటే పెన్షన్ ప్రయోజనాలను పొందలేరు. ఒక్క రోజు ఆలస్యమైనా, మీరు నెల మొత్తానికి 1 శాతం చొప్పున వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను కేవైసీ-కంప్లైంట్ చేయడానికి గడువును 30 సెప్టెంబర్ 2021 నుండి 31 డిసెంబర్ 2021 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. గత ఏప్రిల్ 2021లో సెబీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డిపాజిటరీలు అంటే ఎన్ ఎస్ డి ఎల్, సీడీసీఎల్ లో ఇప్పటికే ఉన్న డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలలో ఆరు ముఖ్యమైన కేవైసీ ఫీచర్‌లను తప్పక అప్‌డేట్ చేయాలి
4. కోవిడ్ రెండో దశ కారణంగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈశాన్య సంస్థలు, కొన్ని వర్గాల సంస్థలకు యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN) జారీ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా UAN నెంబర్ ను ఆధార్ తో జత చేయడానికి ఉన్న గడువును ఈ డిసెంబర్ 31 వరకు పొడిగించారు. UANతో ఆధార్ ను లింక్ చేయకపోతే EPF ఖాతాలో నెలవారీ PF చందా జమ చేయలేరన్న విషయం తెలిసిందే. దాంతో పాటు ఈ లింకింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు, EPF ఫండ్ నుంచి లోన్ కూడా తీసుకోలేరని మరియు వాటిని విత్‌డ్రా కూడా చేయలేరన్న విషయం తెలిసిందే కాబట్టి 31 వ తేదీ నాటికి ఆయా పనులన్నీ పూర్తి చేసుకోవడం బెటర్.